Index-Telugu

Wednesday, 24 January 2018

375. Kanaleni Kanulelanayya vinaleni chevulelanayya

కనలేని కనులేలనయ్యా
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా

ఆకలిగొన్న ఓ యేసయ్యా
నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)
అట్టి జీవాహారమైన నిన్ను
చూడ లేనట్టి కనులేలనయ్యా   

దాహము గొన్న ఓ యేసయ్యా
జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)
అట్టి జీవాధిపతివైన నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా   

రాజ్యమును విడిచిన ఓ యేసయ్యా
నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)
అట్టి రాజులకు రాజైన నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా

374. Aa dari chere dare kanaradu

ఆ దరి చేరే దారే కనరాదు
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితాన చీకటులై మ్రోగే (2)
ఆ దరి చేరే
హైలెస్సో హైలో హైలెస్సా (2)

విద్య లేని పామరులను పిలిచాడు
దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి
ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2)      ||ఆ దరి||

సుడి గాలులేమో వీచెను
అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను
నా జీవితమే బేజారైపోయెను (2)      ||ఆ దరి||

వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు
ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా
ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2)      ||ఆ దరి||

373. Horugali Thufanulo Chiru divvega



          హోరుగాలి తుఫానులో చిరుదివ్వెగా
          కోరి నిలిపెను ప్రభువు నను వెనుదియ్యక

1.        స్వామి యేసుని దివ్యకాంతులు గ్రోలుచూ
          క్షేమకరుడగు క్రీస్తు నీడను నిలచుచు
          నీ నిషేధపు చీకటుల్‌ పోనార్పగా

2.       జీవ జ్యోతిని నీలకాంతులు ఛాయగ
          జేరి ఆ ప్రభు క్రీస్తు చెంతను నిలచుచు
          జీవితాంతము వరకు చీకటి లేదుగా

3.       తూర్పు తెల్లగ వెలసినది పరికింపుమా
          మేలుకొని సంసిద్ధుడౌ ఓ పాంధుడా 
          నిలచి చూచెదవేల సాగుము రయముగ

372. Lokamantha Muniginanu Chimma Chikati Kamminanu

లోకమంత మునిగినను చిమ్మచీకటి కమ్మినను
ఎదురుగాలి విసరినను ఎండగాలి యుడినను
గండములలో నుండగానే గుండెదిగులు చెందగా
అండగా యెహోవా నీకు తోడు నీడగా నుండు
ఆఆ.. ఆఆ.. ఆఆ.. ఆఆ..

తీర్పరులు నిన్నుచూచి తప్పుగ భావించినను
లేనిపోని నేరములను భారములను మోపినను
ఘోరమైన సిలువ నీవు మోయవలసి వచ్చినను
అండగా యెహోవా నీకు తోడు నీడగా నుండు
ఆఆ.. ఆఆ.. ఆఆ.. ఆఆ..

తాళలేక నిన్నుచూచి గేలిచేసి నవ్వినను
నీతి న్యాయములకు నిన్ను వేరుచేసి పోయినను
తరమువారి ఉరవములు తరలివచ్చి పైనిబడన్‌
అండగా యెహోవా నీకు తోడు నీడగా నుండు
ఆఆ.. ఆఆ.. ఆఆ.. ఆఆ..

మనుష్యుడా నీకేమి భయము
మనుజులేమి చేయగలరు
మహిమగల రాజు క్రీస్తు రాక సమీప్యంబు సుమీ
అన్ని సంగతులను దెలుపువాడు
క్రీస్తు నిజము నరుడా
అట్టి యేసుక్రీస్తు నీకు తోడు నీడగా నుండు
ఆఆ.. ఆఆ.. ఆఆ.. ఆఆ..

371. Nenu Velle Margamu Na Yesuke Theliyunu

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్

కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్

జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్

విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు
సాతాను సుడిగాలి రేపగా నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్

370. Nadu Jivamayane Na Samasthamu

నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వమేసుకే నా సుజీవము
నాదు దైవము – దివి దివ్య తేజము (2)           

కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను
చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2)    

సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడే
రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను (2)

కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును
తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో (2)

369. Na Priya Yesu Raja Aaduko Nannepudu

నా ప్రియ యేసురాజా ఆదుకో నన్నెపుడూ
శోధనలో వేదనలో నిన్ను వీడి పోనియ్యకు IIనా ప్రియII

కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే మెదిలెను నా హృదయంలో
కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు IIనా ప్రియII

మరచితి నీ వాగ్ధానం సడలెను నా విశ్వాసం
శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నను పెనుగొనగా
కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు IIనా ప్రియII

నేరములెన్నో నాపై మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో దూరముగా పరుగిడితి
కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు IIనా ప్రియII

చాలిన నిన్ను విడిచి కోరితి దీవెనలెన్నో
భావములెన్నో అరసి వదలితి వాక్యాధారం
కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు IIనా ప్రియII

368. Na Jivitha Vyadhalandu Yese Javabu

నా జీవిత వ్యధలందు - యేసే జవాబు
యేసే జవాబు - ప్రభు యేసే జవాబు         IIనాII

తీరని మమతలతో - ఆరని మంటలతో
ఆశ నిరాశలలో - కూలెను నా బ్రతుకే
ననుగని వచ్చెను - తనకృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము కడిగెను      IIనాII

చీకటి వీధులలో - నీటుగ నడిచితిని
లోకపు టుచ్చులలో - శోకము చూచితిని
ననుగని వచ్చెను - తనకృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము కడిగెను      IIనాII

ద్రోహుల నమ్ముకొని - స్నేహము జేసితిని
యిడుమల పాల్జేసి - ఎడబాసిరి నన్ను
ననుగని వచ్చెను - తనకృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము కడిగెను      IIనాII

హంగుల వేషముతో - రంగుల వలయములో
నింగికి నేనెగిరి - నేలకు వ్రాలితిని
ననుగని వచ్చెను - తనకృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము కడిగెను      IIనాII

367. Na Jivitha Yathralo Prabhuva Ni Padame Saranam

నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకము నందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు

పలువిధ శోధన కష్టములు ఆవరించుచుండగా
కరుగక యున్ననా హృదయమును - కదలక కాపాడుము

నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు
నీ కుడి హస్తము నాతో నుండన్ - నా జీవిత యాత్రలో

ఈ లోక నటన ఆశలన్నియు తరిగి పోవుచుండగా
మారని నీ వాగ్ధానములే - నమ్మి సాగిపోదును

366. Dinadayaluda Yesa Ni Dasuni Prardhana Vinuma

దీనదయాళుడ యేసా
నీ దాసుని ప్రార్ధన వినుమా
దేవా యేసయ్యా
నా ఆర్తధ్వని వినుమయ్యా                  || దేవా ||

తల్లిగర్భమున మొదలుకొని
నన్నాదుకొన్నది నీవెగదా
సహాయకులెవ్వరు లేరిలలో
నీవేల దూరము నున్నావు              || దేవా ||

అడుగుడి మీకివ్వబడున్
వెదకండి మీకు దొరుకునని
ప్రతివాడు అడిగి పొందునని
అభయమ్ము నిచ్చిన యేసయ్యా         || దేవా ||

విడువను యెడబాయనని
వాగ్ధానమిచ్చిన నా యేసా
స్తోత్రించెదన్ సమాజములో
సేవించెదన్ నీ నామమునే                 || దేవా ||

365. Chikatule nannu kammukonanga

చీకటులే నన్ను కమ్ముకొనంగా
దుఃఖంబు నాకాహారంబు కాగా
ఏకాకినై లోకంబులోన
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)

అన్యాయ క్రియలు అధికంబు కాగా
మోసంబులే నాకు వ్యసనంబు కాగ
ఆకాశ శక్తులు కదలించబడగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)

మేఘములే నన్ను ముసురుచుండంగ
ఉరుములు నాపై దొరలుచుండంగా
వడగండ్ల వాన కురియుచుండంగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)

త్వరలోనే రమ్ము పరలోక వరుడా
వరమేరి తనయా ఓ గొర్రెపిల్లా (2)
కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా (2)
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)     ||చీకటులే||

364. Bandalo nundi menduga pravahinchuchunnadi

బండలో నుండి మెండుగా ప్రవహించు చున్నది
నిండుగ నింపుచున్నది సజీవ జలనది
జీవ జలనది జీవ జలనది ||2||
సజీవ జలనది ||2||

ఎండినను ఎడారిని బండగనైన గుండెను
పండించుచున్నది మండించుచున్నది
రండి - రండి – రండి

యేసుని సిల్వ లోనది ఏరులై పారుచున్నది
కాసులు లేకనే తీసికో వేగమే
ఆగు - త్రాగు – సాగు

దాహము గొన్నవారికి దాహము తీర్చుచున్నది
పానము సేయది దానము నీకది
శాంతి - కాంతి - విశ్రాంతి

363. Immanuyelu Rakthamu Impaina Yutagu

ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును

యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా

ఆ యూట మున్గి దొంగయు
హా! శుద్ధు-డాయెను
నేనట్టి పాపి నిప్పుడు
నేనందు మున్గుదు

నీ యొక్క పాప మట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొర్రె పిల్ల? నీ
రక్తంబే చాలును

నా నాదు రక్తమందున
నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందు జూచెదన్

నా ఆయుష్కాల మంతటా
నా సంతసం-బిదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్
నా గాన-మిద్దియే

362. Swasthatha parachu Yehova Nive


స్వస్థత పరచు యెహోవా నీవే
నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా
మా ఆరోగ్యం నీవే ఆదరణ నీవే ఆనందం నీవెగా 
ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము
వదలిపోవును వ్యాధి బాధలన్ని
శ్రమ పడువారిని సేదదీర్చి
సమకూర్చుము వారికి ఘన విజయం 
పాపపు శాపము తొలగించుము
అపవాది కట్లను తెంచివేయుము
క్రీస్తుతో నిత్యము ఐక్యముగా 
నీ మహిమలో నిత్యము వసింపనిమ్ము

361. Silvalo Naskai Karchenu Yesu Rakthamu



          సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
          శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
          యేసు రక్తము ప్రభు యేసు రక్తము
          అమూల్యమైన రక్తము యేసు రక్తము       ||సిల్వలో||

1.        సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము
          సంధి చేసి చేర్చును యేసు రక్తము
          యేసు రక్తము ప్రభు యేసు రక్తము
          ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము        ||సిల్వలో||

2.       సమాధాన పరచును యేసు రక్తము
          సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము
          యేసు రక్తము ప్రభు యేసు రక్తము
          సంపూర్ణ శాంతి నిచ్చును యేసు రక్తము     ||సిల్వలో||

3.       నీతిమంతులుగా చేయును యేసు రక్తము
          దుర్ణీతినంత బాపును యేసు రక్తము
          యేసు రక్తము ప్రభు యేసు రక్తము
          నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము ||సిల్వలో||

4.       రోగములను బాపును యేసు రక్తము
          దురాత్మల పారద్రోలును యేసు రక్తము
          యేసు రక్తము ప్రభు యేసు రక్తము 
          శక్తి బలము నిచ్చును యేసు రక్తము        ||సిల్వలో||

Tuesday, 23 January 2018

360. Vijayam Ni Rakthamlo Abhayam Ni Hasthamlo

విజయం నీ రక్తంలో - అభయం నీ హస్తములో 
సమాధానం సదాకాలం      ||2||
నా రక్షకుడా నీలో...          ||విజయం||

స్వస్థత నీ రక్తంలో - భద్రత నీ హస్తంలో
సమాధానం సదాకాలం      ||2||
నా రక్షకుడా నీలో...          ||విజయం||

రక్షణ నీ రక్తంలో - సాంత్వన నీ హస్తంలో
సమాధానం సదాకాలం      ||2||
నా రక్షకుడా నీలో...          ||విజయం||

క్షమాపణ నీ రక్తంలో - నిరీక్షణ నీ హస్తంలో
సమాధానం సదాకాలం    ||2||
నా రక్షకుడా నీలో...         ||విజయం||

పవిత్రత నీ రక్తంలో - వినమ్రత నీ హస్తంలో
సమాధానం సదాకాలం   ||2||
నా రక్షకుడా నీలో...        ||విజయం||

ఆరోగ్యం నీ రక్తంలో - ఆనందం నీ హస్తంలో
సమాధానం సదాకాలం   ||2||
నా రక్షకుడా నీలో...        ||విజయం||

359. Yesuni Namamulo Mana Badhalu Povunu

యేసుని నామములో మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును
యేసు రక్తముకే యేసు నామముకే యుగయుగములకు మహిమే
అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమున జయమే

ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా
ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే ఐనా
ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు
పరివర్తన చెందినచో పరలోకం చేరేదవు
యేసు రక్తముకే యేసు నామముకే యుగయుగములకు మహిమే
అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమున జయమే

రాజువైన యాజకుడవైనా నిరుపేదవైన బ్రతుకు చెడియున్నా
ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువనీడే నీకు లేకున్నా
శ్రీ యేసుని నామములో విశ్వాసం నీకున్నా
నీ స్థితి నేడేదైనా నిత్యజీవము పొందెదవు
యేసు రక్తముకే యేసు నామముకే యుగయుగములకు మహిమే
అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమున జయమే

358. Ni Raksthame Ni Rakthame Nan Sudhikarinchun

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నా బలము (2)

నీ రక్త ధారలే ఇల
పాపికాశ్రయంబిచ్చును (2)
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచుము (2)             ||నీ రక్తమే||

నశించు వారికి నీ సిలువ
వెర్రితనముగ నున్నది (2)
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియై యున్నది (2)          ||నీ రక్తమే||

నీ సిల్వలో కార్చినట్టి
విలువైన రక్తముచే (2)
పాప విముక్తి చేసితివి
పరిశుద్ధ దేవ తనయుడా (2)          ||నీ రక్తమే||

పంది వలె పొర్లిన నన్ను
కుక్క వలె తిరిగిన నన్ను (2)
ప్రేమతో చేర్చుకొంటివి
ప్రభువా నీకే స్తోత్రము (2)               ||నీ రక్తమే||

నన్ను వెంబడించు సైతానున్
నన్ను బెదరించు సైతానున్ (2)
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే (2)                 ||నీ రక్తమే||

స్తుతి మహిమ ఘనతయు
యుగయుగంబులకును (2)
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హుడా నీకే తగును (2)            ||నీ రక్తమే||

357. Nanu Preminchi Rakshinchina Na Yesayya

నను ప్రేమించి రక్షించిన నా యేసయ్యా
నీ రక్తంతోనే నను కడిగి శుద్ధి చేసితివి ||2||
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా                 ||2||

కళ్లు మూసిన నీ రూపమే
కళ్లు తెరచిన నీ సౌందర్యమే              ||2||
కౌగిలిలో నను దాచితివి
నీ కౌగిలిలో నను దాచితివి
కృపా సత్య సంపూర్ణుడ నా యేసయ్యా ||2||

నీ కృపతో నను పిలిచావు
నీ మాటతో నను లేపావు                     ||2||
నీతోనే నేనుండుటే
నీలోనే నేనుండుటే
నా ఆశై వున్నది నా కాంక్షై వున్నది      ||2||

నిను నమ్మిన ప్రజలను ఎప్పుడు
సిగ్గు పరచవు ఎన్నడు నీవు                 ||2||
నా అతిశయం నీదేనయ్యా
నా ఆనందం నీవేనయ్యా
నను వెన్నుతట్టి నా పక్షముగ ఉన్నావయ్యా ||2||

356. Eguruthunnadi Vijaya Pathakam Yesu Raksthame Ma Jivitha Vijayam

ఎగురుతున్నది విజయపతాకం

యేసురక్తమే మా జీవిత విజయం

రోగ దుఃఖ వ్యసనములు తీర్చివేయును

సుఖజీవనం చేయుటకు శక్తి నిచ్చును

రక్తమే రక్తమే రక్తమే యేసు రక్తమే

రక్తమే జయం యేసురక్తం జయం

యేసుని నామము నుచ్చరింపగనే

సాతానుని సైన్యము వణకుచున్నది

వ్యాధుల బలము నిర్మూలమైనది

జయమొందెడి నామము నమ్మినప్పుడే     ||రక్తమే||

దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం

ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం 

పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన

క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం ||రక్తమే||         

మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా

నీతితోను నీ హస్తము చాపుము దేవా 

నీ పాదపద్మముపై చేరియున్న ప్రజలను

స్వస్థపరచుము తండ్రీ ఈ క్షణమందే          ||రక్తమే||

355. Santhosham Pongindi Santhosham Pongindi



          సంతోషం పొంగింది సంతోషం పొంగింది
          సంతోషం పొంగుచున్నది - హల్లెలూయ
          యేసునన్ను రక్షించిన నాినుండి నేివరకు సంతోషం పొంగుచున్నది

 1.       దారితప్పి తిరిగితిని - ప్రభు ప్రేమ నేను కాననైతిని
          ఆయన నన్ను కరుణించి - తనదు రక్తములో కడిగి
          జీవితమును మార్చి - నిత్యజీవ మిచ్చును

2.       నీదు పాప జీవితమును - ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము
          ఆయన నిన్ను క్షమియించి - తనదు రక్తములో కడిగి
          నీ జీవితమును మార్చి - నిత్యజీవ మిచ్చును

3.       ఎన్నిసార్లు జీవవాక్యమును - ఎదురించి నీవు సాగిపోదువు
          ఆత్మ స్వరము విను - సమర్పించుకొనుము
          స్వంత రక్షకునిగా - యేసుని చేర్చుకో

4.       ప్రభు ప్రేమ మరచితివా - లోకాశలందు పడిపోతివా
          యేసువైపు చూడుము - నిరీక్షణ పొందుము 
          సాతానుపై గొప్ప - విజయము నిచ్చును