Index-Telugu

Monday, 16 September 2019

523. Kalala Unnadi Nenena Annadi

కలలా ఉన్నది నేనేనా అన్నది
నిజమౌతున్నది నీవు నాతో అన్నది
నిరాశల నిధిలోన – ఉషోదయం వచ్చింది
యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2)      ||కలలా||
మనుష్యులంతా మనసే గాయపరిచి
పురుగల్లె నను నలిపేయ జూచినా (2)
శూరుడల్లె వచ్చినావు
నాకు ముందు నిలచినావు
నాకు బలము ఇచ్చినావు
ఆయుధంగా మార్చినావు
చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ      ||కలలా||
శూన్యములో నాకై సృష్టిని చేసి
జీవితాన్ని అందముగా మలచేసి (2)
మాట నాకు ఇచ్చినవారు
దాన్ని నెరవేర్చువారు
నిన్ను పోలి ఎవరున్నారు
నన్ను ప్రేమించువారు
యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ      ||కలలా||

522. Kammani Bahu Kammani

కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని
తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం (2)
జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం (2)
యేసు నీ ప్రేమామృతం (2)        ||కమ్మని||
ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన (2)
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2)
కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2)        ||కమ్మని||
నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ (2)
ఆరాధింతును నిన్ను అనుదినము (2)
జీవింతును నీకై అనుక్షణము (2)        ||కమ్మని||

521. Nithya Prematho Nannu Premichen

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే
నిన్ను నేను – ఎన్నడు విడువను (2)
నిత్యము నీతోనే జీవింతున్
సత్య సాక్షిగ జీవింతున్
నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)
ఏక రక్షకుడు యేసే
లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)
నా సర్వము నీకే అర్పింతును
పూర్ణానందముతో నీకే అర్పింతున్
నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)
మేఘ రథములపై రానైయున్నాడు
యేసు రాజుగ రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి (2)
స్వర్గ రాజ్యములో యేసున్
సత్య దైవం యేసున్
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే

520. Anni Sadhyame Yesuku Anni Sadhyame

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే (2)
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)           ||అన్నీ సాధ్యమే||
మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)
మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2)||అన్నీ సాధ్యమే||
బండనే చీల్చగా – జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)
బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని
మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2)           ||అన్నీ సాధ్యమే||
ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)
యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2)           ||అన్నీ సాధ్యమే||
కష్టాల కడలిలో – కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)
కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2)           ||అన్నీ సాధ్యమే||

519. Sumadhura Swaramula Ganalatho

సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2)        ||సుమధుర||
ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే – నా ఆనందము
నీవే నీవే – నా ఆధారము (2)        ||సుమధుర||
సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే – నా జయగీతము
నీవే నీవే – నా స్తుతిగీతము (2)        ||సుమధుర||
వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే – నా అతిశయము
నీకే నీకే – నా ఆరాధన (2)        ||సుమధుర||

Monday, 9 September 2019

518. Nijamaina Drakshavalli Neeve

నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే (2)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ – (2)    
అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2)  
నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2)  
షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2)