శాంతికి దూతగా –
ప్రేమకు మూర్తిగా
ఆశల జ్యోతిగా –
మరియకు సుతునిగా /2/
యేసు జనియించె –
ప్రభు యేసు జనియించె /2/
Happy Christmas –
Merry Christmas /4/శాంతికి /
కలుషితాలే తెలియనోడు
– కన్యకే జనియించే ..
పసిడి మనసే
కలిగినోడు – పేదగా జనియించె
భువనాలనేలువాడు –
భవనాలలోన కాదు
పశుశాలలోన నేలపై
జనియించె –
మన ప్రభువే జనియించె
/శాంతికి/
శుభము కూర్చే –
శిశువు తానై
దిశను మార్చే –
సూచనై
పాపమంటి కారుచీకటిలో
– ఒక పుణ్యకాంతియై ప్రసరించే..
– ప్రభు తానై –
ప్రభవించే నిల! /శాంతికి/
నింగిలోని దివ్యవాణి
నేలపై ధ్వనియించె
దైవమంటి మమత తానై
మనిషిగా ఉదయించే
మనలోని బాధ తీర్చే –
జనజీవితాలు మలచే –
ఎనలేనిజాలై
లాలిగుణమై నిలిచె –
ప్రభుకిరణం –
తొలికిరణం /శాంతికి/