నూతన పరచుము ఈ నూతన సంవత్సరం
నూతన పరచుము యేసయ్యా నూతన సంవత్సరం
నూతన మనసుతో నూతన ప్రేమతో
నూతన కృపలతో నూతన దర్శనముతో
నను నింపుము నడిపించుము
ఈ సంవత్సరం నూతన సంవత్సరం
నను నింపుము నడిపించుము
ఈ సంవత్సరం క్రొత్త సంవత్సరం
పాతవి మరచి సమస్తం నూతనపరచి
గత చేదును మరచి మధురంగా నన్ను మార్చి
నూతనమైన జ్ఞానముతో నూతనమైన ఫలములతో
నూతనమైన దీవెనలతో నూతనమైన మేలులతో // నను నింపుము//
లోకమును మరచి నిత్యజీవంలో నడిపి
నీ ఆత్మతో నింపి నీ రూపులో నను మలచి
నూతనమైన శక్తితో నూతనమైన బలముతో
నూతనమైన వరములతో నూతనమైన ఉజ్జీవంతో // నను నింపుము//