Index-Telugu

Wednesday, 20 August 2025

Sthiraparachuvadavu Balaparachuvadavu| Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు
పడిపోయిన చోటే నిలబట్టువాడవు
ఘనపరచువాడవు హెచ్చించువాడవు
మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు

ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు
యేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము

సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే మా జీవమున్నది
మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి

నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?
నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా?
మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలును
అపవాది తలచిన కీడులన్నీ, మేలైపోవును

Thursday, 7 August 2025

Megha Stambhamaina Sannidhini | Telugu Christian Song #593

నీ సన్నిధియే నాకు చాలయా

మేఘస్తంభమైన సన్నిధిని
రూపు మార్చగల సన్నిధిని (x2)
నడిపించే సన్నిధిని
నను వీడి పోనివ్వకు (x2)

బలహీనుడు బలవంతుడవునే
నీ సన్నిధి వచ్చుటచే
ఏమి లేకపోయినా నిండుగా ఉండెదన్
నీ సన్నిధిలో నేను
నీ సన్నిధియే నాకు చాలయా
నా హృదివాంఛ నీవెనయా (x2)

మన్నాను పక్షులను నీటిని అందించావు
అన్నియు అధికముగా ఉన్నవి (x2)
అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నీవు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2)
నీ సన్నిధియే నాకు చాలయా
నా హృదివాంఛ నీవెనయా (x2)

ఈ లోక అధికారం రాజ కిరీటము
తలపై మెరుస్తూ ఉంటున్నను (x2)
అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2)
నీ సన్నిధియే నాకు చాలయా
నా హృదివాంఛ నీవెనయా (x2)

అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2)
నీ సన్నిధియే నాకు చాలయా
నా హృదివాంఛ నీవెనయా (x2)

Tuesday, 5 August 2025

Yevarikki Yevaru | Telugu Christian Song # 592

ఎవరికీ ఎవరు ఈ లోకములో
ఎంతవరకు మనకీ బంధము ×2
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికి ఎవరు శాశ్వతము ×2
మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష, దాన్నీ గెలవడమే ఒక తపన ×2

1. తల్లితండ్రుల ప్రేమ ఈ లోకమున్నంతవరకే…
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంతవరకే ×2
స్నేహితుల ప్రేమ, ప్రియురాలి ప్రేమ
స్నేహితుల ప్రేమ, ప్రియుని ప్రేమ
నీ ధనమున్నంతవరకే ×2
— "మన జీవితం"

2. ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంతవరకే
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంతవరకే ×2
యేసులో విశ్వాసము, యేసుకై నీ పరీక్షణ ×2
కాదెన్నడు నీకు వ్యర్థం ×2
— "మన జీవితం"