Index-Telugu

Monday, 22 September 2025

Swasthaparachu Devudu | Telugu Christian Song # 601

🌿 స్వస్థపరచు దేవుడు – Telugu Christian Song 🌿

స్వస్థపరచు దేవుడు – సర్వ శక్తిమంతుడు
కష్ట కాలములోన నన్ను – మరచిపోడు
నమ్మదగిన దేవుడు – ఎన్నడూ ఎడబాయడు
మాట ఇచ్చిన దేవుడు – నెరవేరుస్తాడు
నన్నే ఎన్నుకున్నాడు – నా పేరు పెట్టి పిలిచాడు
శ్రమ ఎదురైనా – బాధేదైనా విడువని దేవుడు
నా పక్షముగానే ఉన్నాడు – నా చేయి పట్టి నడిపాడు
కృంగిన వేళ ధైర్యమునిచ్చి కృప చూపించాడు

|| స్వస్థపరచు ||

చీకటి నుండి వెలుగునకు నడిపించిన నా రక్షకుడు
మరణము నుండి జీవముకు నను దాటించాడు
మారా వంటి జీవితము మధురముగా మార్చాడు
రోగము నిండిన దేహమును బాగు చేసాడు
పొందిన దెబ్బల ద్వారానే స్వస్థతనిచ్చు దేవుడు
చిందించిన రక్తము ద్వారా విడుదలనిచ్చియున్నాడు
అతడే నా ప్రియ యేసుడు – యేసే నా ప్రియ స్నేహితుడు
కౌగిలిలో నను హత్తుకొని కన్నీటిని తుడిచాడు

|| స్వస్థపరచు ||

దూతను ముందుగ పంపించి – మార్గము చక్కగ చేసాడు
ఆటంకములు తొలగించి – విజయమునిచ్చాడు
అగ్ని వంటి శ్రమలోన – నా తోడుగ ఉన్నాడు
ధగ ధగ మెరిసే పసిడి వలె శుద్ధీకరించాడు
నా యెడల ఉన్న ఉద్దేశములు హానికరమైనవి కావు
సమాధానకరమైనవిగా రూపొందించాడు
అతడే నా ప్రియ యేసుడు – యేసే నా పరిహారకుడు
వేదనలో నన్నెత్తుకొని నెమ్మదినిచ్చాడు

|| స్వస్థపరచు ||


🎥 Watch the Song Video 🎶

Tags: Telugu Christian Songs, Swasthaparachu Devudu Lyrics, Jesus Healing Songs

Monday, 15 September 2025

Kalavanti Nee Jeevitham | Telugu Christian Song # 600

🎶 కలవంటి నీ జీవితం 🎶

కలవంటి నీ జీవితం
క్షణభంగురమని యెరుగుము ఓ యువత
అలవంటి నీ యౌవ్వనం
ఎగసిపడే చందము ఓ స్నేహిత (2)

శాశ్వతుడగు యేసును నీవు చేరవా
స్థిరమైన మనస్సును నీవు పొందవా (2) "కల"


కనిపించు ఈలోకం అది ఎంతో రంగుల వలయం
పరుగెత్తు నీ మనస్సుతో
బ్రతుకంత దుర్భరమగును (2)

అదిచేర్చును నిన్ను భ్రమలసుడులకు
నడిపించును నిన్ను చావుకోరలకు (2) "కల"


క్షణమైన నీ కాయం కలిగించును ఆశలు ఎన్నో
నడిపించు నీ మనస్సును సాతాను ఒడిలోకి (2)

భ్రమలన్నీ వదిలి బ్రతుకంతా మార్చుకో
మది నీవు త్రిప్పుకొ ప్రభును చేరుకో (2) "కల"


నీకోసం ఆ యేసయ్య రక్తమడుగులో మ్రానుపై
నీ మనస్సు విడుదల కొరకై
తన ప్రాణము ఇచ్చెనుగా (2)

వెంటాడు ప్రభుని వాక్యము ప్రతిదినము
పరుగు ఎత్తు క్రీస్తుతో ప్రతిస్థలములో (2) "కల"

Prathi Udayam Nee Krupanu | Telugu Christian Song # 599

🎶 మేము పాడెదం 🎶

ప్రతి ఉదయం నీ కృపను
ప్రతి రాత్రి నీ వాత్సల్యతను
పగలంతా కీర్తింతుము
రేయంతా ఆరాదించెదము
అన్నికాలములలో - స్తోత్రార్హుడని నిన్ను (2)

మేము పాడెదం - మేము పాడెదం (2)


Eternal God

ఆరంభము నీవే - అంతముయు నీవే
ఉన్నవాడవు నీవే - అను వాడవు నీవే (2)
నిత్యమూ నివసించూ - దేవుడవని నిన్ను (2)

మేము పాడెదం - మేము పాడెదం (2)


Creator

ఆకాశము నీదే - అంతరిక్షము నీదే
జీవప్రాణులు నీవే - జలరాసులు నీవే (2)
సర్వమును సృజించిన - దేవుడవని నిన్ను (2)

మేము పాడెదం - మేము పాడెదం (2)


Redeemer

నీతిమంతుడు నీవే - నిత్యజీవము నీవే
పరిశుద్ధుడు నీవే - పరిహారము నీవే (2)
మా కొరకు బలియైన - దేవుడవని నిన్ను (2)

మేము పాడెదం - మేము పాడెదం (2)


Ruler

సంకల్పము నీదే - ఆలోచన నీదే
రాజ్యములు నీవే - రారాజువు నీవే (2)
సర్వాధికారియైన - దేవుడవని నిన్ను (2)

మేము పాడెదం - మేము పాడెదం (2)

Asamanudainavadu Avamanaparachadu | Telugu Christian Song # 598

🎶 అసామానుడైన వాడు 🎶

అసామానుడైన వాడు
అవమానపరచడు నిన్ను
ఓటమి ఎరుగనీ మన దేవుడు
ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు
కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు
శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును


అగ్ని గుండాములో నెట్టివేసిన
సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శత్రువే నీ స్థితి చూసి అతిశయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన

నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమా
తేరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై
శత్రువు చేతికి నిను అప్పగించడు


పరిస్థితులన్నీ చేజారిపోయిన
ఎంతగానో శ్రమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన
మంచిరోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా

మారదీ తలరాతని దిగులుపడకుమా
మారాను మధురముగా మార్చును నీకై
మేలులతో నిను తృప్తిపరచును


ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన

పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా
నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా

Ye Reethiga Ninu Padedanu | Telugu Christian Song # 597

ఏ రీతిగా నిను పాడేదను
నా ఆశ్రయదుర్గమా
ఏ రీతిగా నిన్ను వర్ణించెదను
నా రక్షణ శైలమా "2"
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు
ఎనలేని ప్రేమను చూపించినందుకు "2"
పాడెద స్తుతి గానము
కొనియాడెద నీ నామము "2"


తూలనాడిన నా పాప జీవితం
తిరిగి చేర్చేను నీ కరుణా హస్తం "2"
నడుపుము దేవా సరియైన త్రోవలో
దరి చేర్చావే నన్ను నీ నావలో "2"
పాడెద స్తుతి గానము
కొనియాడెద నీ నామము "2"


చీకటి బ్రతుకులో వెలుగు దీపమై
చెదరిన వారికి నీవే మార్గమై "2"
మరువను దేవా నీ ఘన మేళ్లను
నీతో నడుచును నా జీవిత పరుగును "2"

పాడెద స్తుతి గానము
కొనియాడెద నీ నామము "2"
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు
ఎనలేని ప్రేమను చూపించినందుకు "2"

Friday, 12 September 2025

Yese Nee Adharamu Digulu Chendaku | Telugu Christian Song # 596

✝️ యేసే నీ ఆధారము ✝️

యేసే నీ ఆధారము దిగులు చెందకు
మరలా వెనుదిరుగకు ధైర్యముగా ఉండు
ఓర్పుతో వేచి ఉండు నూతన బలము నొందెదవు
పక్షిరాజు వలే పైపైకి ఎగురుదువు

సహనమును విడువకు ఇక కొద్ది కాలమే x3
నిబ్బరం కలిగి ఉండు విజయము నీదే

నిరీక్షణ కోలిపోకుము – యేసేగా నీ సహాయము x2

యేసే నా ఆధారము దిగులు చెందను
మరలా వెనుదిరుగను ధైర్యముగా ఉందున్
ఓర్పుతో వేచి ఉందున్ నూతన బలము నొందెదను
పక్షిరాజు వలే పైపైకి ఎగురుదును

సహనమును విడువను ఇక కొద్ది కాలమే x3
నిబ్బరం కలిగి ఉందున్ విజయము నాదే

నిరీక్షణ కోలిపోను నేను – యేసేగా నా సహాయము x2

యేసే నా రక్షణ యేసే నా నిరీక్షణ x4

బంధకము లోను నిరీక్షణ గలవారలారా
రెండింతల మేలును చేయువాడు ఆయనే
నీ గూర్చి ఉద్దేశించిన తలంపులాయన ఎరుగును
అవి మేలైనవి కీడు కొరకు కాదు

Thursday, 4 September 2025

Netho Unte Jeevitham | Telugu Christian Song # 595

నీతో ఉంటే జీవితం
వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం
బాటేదైన పువ్వుల కుసుమం (2)
నువ్వే నా ప్రాణాధారము ఓ….
నువ్వే నా జీవాధారము (2)

నువ్వే లేకపోతే నేను జీవించలెను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలెను
నువ్వే లేకపోతే నేను ఊహించలెను
నువ్వే లేకపోతే నేను లేనెలెను (2)
నిను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం (2) ||నువ్వే నా ||

తూహీ మేరే జీవన్ యేషూ – తూహీ హే ప్రభూ…
తూహీ మేరే మన్ మే యేషూ – కోయి నే ప్రభూ… (2)
తేరే బిన్ మే తో జీనా సబర్నా ముషికిల్ హే యారో…
తేరే బిన్ మే గుజర్నా బితాన యా మున్ కిన్ ప్యారో… (2)
తూహీ మేర ప్రాణాదార్ హే…
తూహీ మేర జీవాధార్ హే… (2)

నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్ని వేతికా, అంత శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
నిను విడువను దేవా, నా ప్రభువా, నా ప్రాణనాధ
నీ చేతితో మలచి, నను విరచి సరిచేయు నాథ (2)||నువ్వే నా ||