Tuesday, 27 March 2018

424. Snehithudu Prana Priyudu Ithade Na Priya Snehithudu

       స్నేహితుడు - ప్రాణ ప్రియుడు - ఇతడే నా ప్రియ స్నేహితుడు
       నా సమీప బంధువుడు - దీనపాపి బాంధవుడు

 1.    తోడు నీడలేని నన్ను చూడ వచ్చెను 
       జాడలు వెదకి జాలి చూపెను
       పాడైన బ్రతుకును బాగుచేసెను - ఎండిన మోడులే చిగురించెను
       వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా

2.    దాహము గొనినే దూరమరిగితి - మరణపు మారా దాపురించెను
       క్రీస్తు జీవం మధురమాయెను - క్షీర ద్రాక్షలు సేద దీర్చెను
       వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా

 3.   బాధలలో నన్ను ఆదరించెను - శోధనలందు తోడు నిల్చెను
       నా మొరలన్నియు ఆలకించెను - నా భారమంతయు తొలగించెను
       వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా

423. Solipovaladu Manasa SoliPovaladu

       సోలిపోవలదు మనసా సోలి పోవలదు
       నిను గని పిలచిన దేవుడు విడిచిపోవునా

 1.    ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా
       ప్రియుడు యేసు చేరదీసినా ఆనందం కాదా

 2.   శోధనలు జయించువాడు భాగ్యవంతుడు
       జీవ కిరీటం మోయువేళ ఎంతో ఆనందం

 3.   వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు
       సేద దీర్చె ఆత్మ నిన్ను చేర ప్రార్ధించు 

422. Sahodarulu Ikyatha Kaligi Nivasinchuta

       సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
       ఎంతమేలు ఎంత మనోహారం
       ఎంత మధురం ఎంత సంతోషం

 1.    నీతిమంతులు ఖర్జూర వృక్షముల వలెను
       మొవ్వ వేయుచు దినదినం వర్ధిల్లెదరు      ||2||
       లెబానోను పర్వతముపై దేవదారు వృక్షాలవలెను
       దేవుని సన్నిధిలో నిలిచి ఉండెదరు   ||2||

2.    దినములు చెడ్డవి గనుక సమయం పోనియ్యక
       వినయ మనస్సుతో ప్రభు సన్నిధిలో వేడుదము ||2||
       అజ్ఞానుల వలెకాక జ్ఞానుల వలె మనము
       యేసయ్య బాటలో పయనించెదము  ||2||

421. Rammanuchunnadu Ninnu Prabhu Yesu

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు
వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు

ఎటువంటి శ్రమలందునూ ఆదరణ నీకిచ్చునని
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దులేని యింపు నొందెదవు

కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్‌
కారుమేఘమువలె కష్టములు వచ్చినను
కనికరించి నిన్ను కాపాడును

సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును
ఆయన నీ వెలుగు రక్షణ అయినందున
ఆలసింపక నీవు తర్వపడి రమ్ము

సకల వ్యాధులను స్వస్థపరచుటకు
శక్తిమంతుడగు ప్రభుయేసు ప్రేమతో
అందరికి తన కృపల నిచ్చును

420. Yesuva Nannu Nivu Enthagano Preminchithive

యేసువా నన్ను నీవు
ఎంతగానో ప్రేమించితివే
నీ చల్లని నీడలో ||2||
ఆశ్రయమిచ్చి బ్రోచితివే
యేసయ్య నా ప్రభు యేసయ్య నా సర్వమా
యేసయ్య నా విభుడ యేసయ్య నా దైవమా

కలతలలోనే కృంగియుండ
వ్యధలలో నే నలిగియుండ
జీవితముపై ఆశలేక
విసిగి వేసారి నేనుండగా
ఆదరించి జీవితముపై ||2||
ఆశలెన్నో కలిగించితివే
యేసయ్య నా ప్రభు యేసయ్య నా సర్వమా
యేసయ్య నా విభుడ యేసయ్య నా దైవమా

కను రెప్పపాటున కాలుజారి
నిను వేడి వేదనతో వగచే ఘడియ
అవమాన భారముతో అల్లాడుచు
అపజయ వేళలలో కుములుచుండ
లేవనెత్తి క్షమియించి ||2||
నా దోషమే మరచితివే
యేసయ్య నా ప్రభు యేసయ్య నా సర్వమా
యేసయ్య నా విభుడ యేసయ్య నా దైవమా

అనుదినము నిన్ను వెంబడింతున్
అనుక్షణము నీ ప్రేమన్ ఆస్వాదింతున్
ప్రేమ సుమములతో నిన్ను ఆరాధింతున్
నాహృదిలో నిత్యము నిన్ స్మరియించెదన్
పరమ పధమె కనిపించగ ||2||
తరలివత్తున్ నీ సన్నిధికిన్
యేసయ్య నా ప్రభు యేసయ్య నా సర్వమా
యేసయ్య నా విభుడ యేసయ్య నా దైవమా

419. Yesu Raju Ninnu Pilichenu Premathoda Ninnu Korenu

యేసురాజు నిన్ను పిలిచెను
ప్రేమతోడ నిన్ను కోరెను
కాలయాపనేల క్రైస్తవా
క్రీస్తుకొరకు పంట కూర్చవా

నిర్విచార రీతి నెట్లు నేల నిలుతువు
నిన్ను పిలుచు క్రీస్తు స్వరము నాలకించవా
క్రీస్తునాధుని తోటి కార్మికుండవై
కలసి నడచుటెంత ఘనతరా

యేసు నెరుగనట్టి తోటి యువకులెందరో
వ్యర్ధమైన పంటగా నశించు నుండగా
చూచుచుందువా నీదు సాక్ష్యమియ్యవా
భార రహితమేల క్రైస్తవా

కన్నులెత్తి పొలము నీవు పారచూడరా
తెల్లవారి కోతకొరకు సిద్ధమాయెను
విత్తువాడును కోత కోయువాడును
సంతోషించు తరుణమాయెరా

418. Yesu Natho Mataladayya

యేసు నాతో మాటలాడయ్యా
అనుదినం క్షణం నీదు శక్తి నాకవసరము

యేసు నాతో నడచిరావయ్యా ||యేసు ||

యేసు నాదు కాపరి నీవయ్యా ||యేసు ||

యేసు నీదు బిడ్డ నేనయ్యా ||యేసు ||

యేసు నాదు దిక్కు నీవయ్యా ||యేసు ||

యేసు నాదు రాజు నీవయ్యా ||యేసు ||

హల్లెలూయా హోసన్న నీకే ||యేసు ||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...