కన్నీటి కడలిలో - క్రీస్తూ నీ పడవలో
కదిలింది
నా బ్రతుకు యాత్ర - కరిగింది నా గత చరిత్ర
గతమెంచి నావారే పతితంచు బిలిచారే
భీతించి
బాధించినారే వేదించి వెలివేసినారే
మితిమించిన ప్రేమ నేతెంచి రక్షించి
నీ
చెంత నను జేర్చినావా నా చింతలే దీర్చినావా
దుష్టాత్మలే యేడు యిష్టాన నను గూడు
కష్టాల
పాల్జేసెనాడు దృష్టించు నీవే నాతోడు
వీక్షించినావు రక్షించనీవు
దయ్యాల
నదిలించినావు ఓ అయ్య నన్ నిల్పినావు
నీ సిల్వ మరణాన్ని నా పాప భరణాన్ని
కనులార
నే గాంచినాను మనసారగా యేడ్చినాను
నీ వ్రేలు చరణాల నే వ్రాలి నీ మ్రోల
నీ
ప్రేమ ధ్యానించినాను నా దేవ తరియించినాను
చిరుచీకటిలో నిన్ను దరిశించ కన్నీళ్ళ
మరుభూమి
కరుదెంచినాను వెదుకాడి వేసారినాను
నినుగాన లేక నువు నాకు లేక
విలపించుచున్నాను
దేవా ఓదార్చగా వేగరావా
గతిలేని నను జూచి అతిగా దయ తలచి
ప్రియమార
పేరెత్తినావే కృపలూర కళ్ళొత్తినావే
నే దీనహీన మౌ మగ్దలీనా
నిను
మోసికొని నేను పోనా నీ ప్రేమ చాటించలేనా