Index-Telugu

Friday, 22 July 2016

21. Goppa Devudani Sakthi Sampannudani

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్
హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా (2)          ||గొప్ప||

అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను (2)          ||హల్లెలూయా||

సాగరాన్ని రెండుగా చేసినావని
సాతాను శక్తులను ముంచినావని (2)
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
సాక్ష్య గీతం నే పాడెదన్ (2)           ||హల్లెలూయా||

No comments:

Post a Comment