Index-Telugu

Tuesday, 26 July 2016

56. Yesu Ni Thalape Naku Entho Haayi

యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి
ప్రభు యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి
యేసు నిను తలంపగానే హృదయ
మానందముతో నిండున్
నీ సముఖమున ముఖము జూచుచు
వాసము చేసినపుడెట్లుండునో

నీ నామస్వర మాధుర్యంబు
నా నాలుక పాడంజాలదు
మానసము వర్ణింపనేరదు
జ్ఞానశక్తి కనుగొనజాలదు

విరిగిన మతి కాశవీవె
వినయుల కానందమీవె
దొరలిపడిన నెత్తుదు నీవె
దొరుకువాడ నీవె వెదకిన

నిన్ను గల్గిన వారిమాట
యెన్నలేవు జిహ్వయు కలమున్
నిన్ను ప్రేమతో జూచువారికి
నీదు ప్రేమ యేమియో తెలియును

యేసు మా సంతోషము నీవె
ఈవె మా బహుమతివై యుందువు
భాసురంబుగ మా మహిమవై
బరగుచుండుము నిత్యము వరకు

No comments:

Post a Comment