Index-Telugu

Thursday, 4 August 2016

107. Ascharyakarudu Alochanakartha Nithyudagu Thandri Balavanthudu

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి
తిరిగి లేచిన పునరుద్ధానుడు
రండి మన హృదయాలను ఆయనకు అర్పించి
ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము
ఆరాధించెదము

ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు
రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

సత్య స్వరూపి సర్వాంతర్యామి
సర్వాధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల కాంతిని మించిన
మహిమా గలవాడు మహా దేవుడు

రండి మనమందరము – ఉత్సాహగానములతో
ఆ దేవ దేవుని – ఆరాధించెదము
ఆరాధించెదము

ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు
రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

No comments:

Post a Comment