Index-Telugu

Thursday, 4 August 2016

111. Daiva Mahima Nindiyunnadi

దైవ మహిమ నిండియున్నది
దైవ జనమా మనమారాధింతుము
దూతల సమూహంతో భూమి అదిరెన్
మన స్తుతులతో ఆకాశం తెరువబడెను

ఆహా మహిమ ఆరాధన గొప్ప సంతోష ఆరాధన
ఘనపరతుము పొగడెదము
పరవశమొందెదము హల్లెలూయ

భూనివాసులారా గంభీరంతో పాడుడి
ఆనంద ధ్వనితో ఆరాధన చేయుడి
ప్రభు దయాళుడు మహాకృప గలవాడు
తరతరములకు నిజ దైవం

నా ప్రాణమా ప్రభున్ సన్నుతించుమా
అంతరంగమా ప్రభు నామమున్ స్తుతించుమా
ప్రభు నీకు చేసిన ఉపకారముల్
మరువకు ఎన్నడు మరువకుము

మహిమ ఆరాధన ఆనందం ఆనందం
మహోన్నత దేవునికి ఘనత ఘనత
పరిశుద్ధ ఆత్మతో ఆరాధింతుము
పరలోక మహిమతో నిండుచున్నాము

No comments:

Post a Comment