Index-Telugu

Thursday, 4 August 2016

119. Nivanti Varu Lerilalao Yesayya Nive Madu Rakshanakarthavu Yesayya

నీవంటి వారు లేరిలలో యేసయ్యా
నీవె మాదు రక్షణకర్తవు యేసయ్యా
నీ సిలువ శక్తిని ఆశ్రయింతుము యేసయ్యా
నీ పునరుత్థానమే నిత్యజీవము యేసయ్యా
ఆది సంభూతుడవు ఆద్యంత రహితుడవు ||2||
ఆకాశ మహా విశాలమునందున్న సర్వాధికారివి ||2||

మా పాప శాపములన్ని విమోచించితివి
మా రోగములకు స్వస్థత చేకూర్చితివి
పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి
శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు ||ఆది||

ప్రతివాని మోకాలు నీ నామమున వంగును
ప్రతివాని నాలుక యేసుప్రభువని ఒప్పుకొనును
పరలోకమందున్న భూమియందున్న వారిలో
పరలోకతండ్రి అధికముగా హెచ్చించును         ||ఆది||

నీదు సింహాసనం నిరంతరం నిలచునది
నీరాజదండం న్యాయార్ధమై ఏలునది
నీతిని ప్రేమించి దుర్ణీతి ద్వేషించువాడవు
నిత్యానంద తైలాభిషేకం నొందినావు                 ||ఆది||

No comments:

Post a Comment