Index-Telugu

Saturday, 6 August 2016

150. Prabhuva.. Kachithivi Inthakalam

ప్రభువా… కాచితివి ఇంత కాలం
కాచితివి ఇంత కాలం
చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2)
నీ సాక్షిగా నేను జీవింతునయ్యా         ||ప్రభువా||

కోరి వెదికావు నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలనన్నిటిని విరిచావయ్యా (2)
నన్ను తలచావులే – మరి పిలిచావులే (2)
అరచేతిలో నను చెక్కు కున్నావులే (2)       ||ప్రభువా||

నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా
మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2)
పాపము కడిగావులే – విషము విరచావులే (2)
నను మనిషి
 ఇల నీవు నిలిపావులే (2)       ||ప్రభువా||

బాధలను బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2)
నన్ను దీవించితివి – మరి పోషించితివి (2)
నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2)       ||ప్రభువా||

నా బాధలో నీవు నిలిచావయ్యా
నీ వాడుగా నన్ను చేశావయ్యా (2)
నన్ను పిలిచావయ్యా చేయి చాపావయ్యా (2)
నీ కృపలో నన్ను కాపాడయ్యా (2)       ||ప్రభువా||

3 comments: