Index-Telugu

Saturday, 6 August 2016

155. Entha Madhuramu Yesuni Prema

ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2)       ||ఎంత మధురము||

అంధకార బంధము నన్నావరించగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2)          ||ప్రేమా||

రక్షించు వారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2)          ||ప్రేమా||

ఎన్నో పాపములు చేసి మూట కడితిని

ఎన్నో మోసములు చేసి
దోషినైతిని బంధము తెంచెను

బ్రతికించెను నన్ను                  ||ప్రేమా||


కుష్టు బ్రతుకు నై నేను కృంగియుండగా

భ్రష్టునైన  నన్ను బ్రతికించెనుగా

బంధము తెంచెను

బ్రతికించెను నన్ను                 ||ప్రేమా|| 

2 comments: