Index-Telugu

Saturday, 6 August 2016

160. Jaligala Daivama Yesayya Mansara

జాలిగల దైవమా యేసయ్యా
మనసారా స్తుతింతున్‌ స్తోత్రింతును
నీవు దేవుడవు సర్వశక్తుడవు (2)
నీ జాలికి హద్దులే లేవు
నీ ప్రేమకు కొలతలే లేవు (2)
అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2)          ||జాలిగల||

నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొని
దుఃఖములను భరించితివే (2)
అయ్యా – దుఃఖములను భరించితివే               ||నీవు||

మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత
నీపైన పడెనే ప్రభూ (2)
అయ్యా – నీపైన పడెనే ప్రభూ                         ||నీవు||

మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే
గాయములచే స్వస్థమైతిమి (2)
నీదు – గాయములచే స్వస్థమైతిమి                ||నీవు||

No comments:

Post a Comment