Index-Telugu

Saturday, 6 August 2016

166. Na Thalampantha Nive Yesayya

నా తలంపంతా నీవే యేసయ్యా
నే కోరేదంతా నీతోడేగదయ్యా
ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ
నీ సేవయే నా భాగ్యం యేసయ్యా             IIనాII

అణువణువు నా ప్రాణమంతా
వేచియున్నది నీకై నిరతము
నీవే నాదు సర్వము ప్రభువా                     IIనాII

నిన్ను ఎరుగక నశించిపోతున్న
ఆత్మల భారం నాలో రగిలే
నీకై నేను ముందుకు సాగెద                    IIనాII

నలిగిపోతుంది నా ప్రియ భారతం
శాంతి సమాధానం దయచేయుమయా
రక్షణ ఆనందం నింపుము దేవా                IIనాII

No comments:

Post a Comment