Index-Telugu

Wednesday, 10 August 2016

185. Yesuni Premanu Nemarakanu

యేసుని ప్రేమను నేమారకను
నెప్పుడు దలచవే యో మనసా
వాసిగ నాతని వర నామంబును
వదలక పొగడవె యో మనసా

పాపుల కొరకై ప్రాణం బెట్టిన
ప్రభునిల దలచవె యో మనసా
శాపమ నంతయు జక్కగ నోర్చిన
శాంతుని పొగడవె యో మనసా

కష్టములలో మన కండగ నుండి
కర్తను దలచవె యో మనసా
నష్టము లన్నియు నణచిన యాగురు
శ్రేష్ఠుని పొగడవె యో మనసా

మరణతఱిని మన శరణుగ నుండెడు
మాన్యుని దలచవె యో మనసా
కరుణను మన కన్నీటిని దుడిచిన
కర్తను పొగడవె యో మనసా

ప్రార్ధనలు విని ఫలముల నొసగిన  
ప్రభునిక దలచవె యో మనసా
వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన
వంద్యుని పొగడవె యో మనసా

వంచనలేక వరముల నొసగిన  
వరదుని దలచవె యో మనసా
కొంచము కాని కూర్మితో దేవుని
కొమరుని పొగడవె యో మనసా

2 comments: