Index-Telugu

Wednesday, 10 August 2016

190. Krupa thappa Verokati ledaya

కృపతప్ప వేరొకటి లేదయా నీ కృపతప్ప వేరెవరు యేసయ్యా
కృపయే కదా నా ఆశ్రయము - నీ కృపయే కదా నా పరవశము

నీ కృప నన్ను విడువనిదీ నీ కృపయే ఎడబాయనిది
నిరంతరము నిలుచును నీ కృపయే

అణువణువునను నీ కృపయే నా అడుగడుగునను నీ కృపయే
నిత్యము నిలుచును నీ కృపయే

నిలువున రేగిన తుఫానులో నిలిపెను నడిపెను నీ కృపయే
నా ఎడ చెలరేగె నీ కృపయే

13 comments: