Index-Telugu

Wednesday, 10 August 2016

197. Ninna Nedu Nirantharam Marane Maravu

నిన్న నేడు నిరంతరం మారనే మారవు
నా జ్ఞాపకాలలో చెరగని వాడవు
నీవే నీవే నమ్మదగిన దేవుడవు
నీవు నా పక్షమై నిలిచే యున్నావు             II నిన్నII

యేసయ్యా నీ ప్రత్యక్షతలో
బయలు పడెనే శాశ్వతకృప నాకై
విడువదే నన్నెల్లపడూ కృప
విజయపధమున నడిపించెనే కృప
విస్తరించెనే నిన్ను స్తుతించినపుడు                 II నిన్నII

యేసయ్యా నీ కృపాతిశయము
ఆదరించెనే శాశ్వత జీవమకై
మరువదే నన్నెల్లప్పుడూ కృప
మాణిక్య మణులను మరిపించెనే కృప
మైమరచితినే నీ కృప తలంచినపుడు             II నిన్నII

యేసయ్యా నీ మహిమైశ్వర్యము
చూపెనే నీ దీర్ఘశాంతము నాపై
ఆదుకొనె నన్నెల్లప్పుడూ కృప
శాంతి సమరము చేసెనే కృప
మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే     II నిన్నII

No comments:

Post a Comment