Index-Telugu

Tuesday, 23 August 2016

224. Dootha Pata Padudi Rakshakun


దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందునన్
భూజనంబు కెల్లను – సౌఖ్యం  సంభ్రమాయెను
ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

ఊర్ధ్వ లోకమందున  – గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున – కన్య గర్భమందున
బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

రావే నీతి సూర్యుడా – రావే దేవ పుత్రుడా
నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను
భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

4 comments: