Index-Telugu

Tuesday, 2 August 2016

81. Stuthi Stuthi Stuthi Stuthi Stuthiki patruda

స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతికి పాత్రుడా
ప్రతిక్షణం దివిని దూత గణము పరమున
శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా
నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా

1. రాజువై రారాజువై ఆ... తండ్రితో
ఆ..సీనుడై మహిమ దేహంబుతో నుండగా
ధవళవస్త్ర తేజరాజ నా విమోచక
నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా

2. సిలువలో స్రవించినా నీ.. రక్తమే
నా.. హృదయము హిమము కంటె తెల్లగా మార్చెను
భక్తిపరుల కాశ్రయంబు నీదు పదములే
నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా

3. లోకము శరీరము సా..తానుడు
నా.. వైరులై నన్ను కవ్వించి మోసపుచ్చిన
కంటి పాప రీతి మమ్ము కాచి యుంటివి
నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా

5 comments:

  1. సర్ దయచేసి ఈ పాటను ఎంపీ3 ఆడియో లోకి తర్జుమా చేయవలసింది గా కోరుచున్నాను

    ReplyDelete
  2. E song link share cheyandi ayyagaru

    ReplyDelete
  3. Video song vasthunda andi e song

    ReplyDelete
  4. 3 charanam lo Spelling mistake undhi brother if possible correct cheyandi. Thanks for uploading

    ReplyDelete