Index-Telugu

Wednesday, 7 September 2016

260. Hey Prabhu Yesu Hey Prabhu Yesu

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా పాపహరా శాంతికరా

1. శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి
శాంతి స్వరూపా జీవనదీపా శాంతి సువార్తనిధి 

2. తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెకదా
విఫలులు జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా 

3. మతములు వెదకిన నిన్నెగదా - వ్రతములు గోరిన నిన్నెగద
పతితులు దేవుని సుతులని చెప్పిన హితమతి నీవెగదా

4. పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగ కురిసెగదా
మలమలమాడిన మానవ హృదయము కలకలలాడెగదా

5. కానన తుల్య సమాజములో హీనత జెందెను మానవతా
మానవ మైత్రిని సిల్వపతాకము దానము జేసెగదా 

6. దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండెగదా
దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివిగదా 

7. పాపము చేసిన స్త్రీనిగని పాపుల కోపము మండెగదా
దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి నీవెగదా 

8. ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసితి నీవెగదా
ఖరమయుడగు సాతానుని గర్వము ఖండనమాయెగదా

No comments:

Post a Comment