Index-Telugu

Wednesday, 7 September 2016

263. Jaya Jaya Yesu Jaya Yesu

జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)
జయ జయ రాజా – జయ రాజా (2)
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం       || జయ జయ ||

మరణము గెల్చిన జయ యేసు
మరణము ఓడెను జయ క్రీస్తు (2)
పరమ బలమొసగు జయ యేసు (2)
శరణము నీవే జయ యేసు                || జయ జయ ||

సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ క్రీస్తు (2)
సమరము గెల్చిన జయ యేసు (2)
అమరముర్తివి జయ యేసు               || జయ జయ ||

సాతాన్ను గెల్చిన జయ యేసు
సాతాను ఓడెను జయ క్రీస్తు (2)
పాతవి గతియించే జయ యేసు (2)
దాతవు నీవే జయ యేసు                  || జయ జయ ||

బండను గెల్చిన జయ యేసు
బండయు ఓడెను జయ క్రీస్తు (2)
బండలు దీయుము జయ యేసు (2)
అండకు చేర్చుము జయ యేసు        || జయ జయ ||

ముద్రను గెల్చిన జయ యేసు
ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2)
ముద్రలు జీల్చుము జయ యేసు (2)
ముద్రించుము నను జయ యేసు     || జయ జయ ||

కావలి గెల్చిన జయ యేసు
కావలి ఓడెను జయ క్రీస్తు (2)
సేవలో బలము జయ యేసు (2)
జీవము నీవే జయ యేసు                || జయ జయ ||

దయ్యాలు గెల్చిన జయ యేసు
దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2)
కయ్యము గెల్చిన జయ యేసు (2)
సాయము నీవే జయ యేసు            || జయ జయ ||

262. Kristhu Lechenu Halleluya

క్రీస్తు లేచెను హల్లెలూయ  క్రీస్తు నన్ను లేపును
ఇద్దియె సునాద సత్యము ఇలను చాటుడి నిత్యము

మృతుల పునరుత్థాన పంటకు ప్రధమ ఫలమగు క్రీస్తులో
మృతులు లేతురు నేను లేతును నాదువరుసలో నిజమిది

పాపమరణ నరకబలములు ప్రభుని శక్తికి ఓడెను
పాపినగు నను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము

మరణమా నీ ముల్లు ఎక్కడ? మరణమా జయమెక్కడ?
మరణమా నీ ముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు

శిలయు ముద్రయు బలిమికావలి గలిబిలియాను రాత్రిలో
ఇలయు పరమును కలుసుకొనియెను గెలుపునొందిన క్రీస్తులో

మృతులు నీదగువారలందరు బ్రతికి లేతురు సత్యము
ప్రేతలను జీవింపజేయును పృధివి క్రీస్తుని విజయము

స్తుతియు మహిమయు ఘనత నీకె స్తుతికి పాత్రుడ రక్షకా
స్వంత రక్తము చిందితివి నా స్వామి యిదెనా యంజలి

261. Emayenu Emayenu Apavadi Yatnalu Emayenu

ఏమాయెను! ఏమాయెను! అపవాది యత్నాలు ఏమాయెను

1.  మొదటి తల్లిని జూచి - మోస వాక్యంబులు వెదజల్లి దైవాజ్ఞ - విడుచునట్లు         
జేయ పిదప వచ్చినవారు - పెరుగంగ పాపాలు ఎదిగి ఎన్నెన్నియో -       
విధములై వ్యాపింప వదలించుటకు దైవ - వ్యక్తియైన యేసు పథమై రాగ     
మోక్ష - పథమును తప్పించి తుదకు పాపములోకి - త్రోయ జూచిన దుష్ట             
= వధకుడు పన్నిన - వరుస ప్రయత్నాలు                                       

 2.  పరమాత్ముని యాజ్ఞ-పాటింప నందున మరణంబు కల్గునను - మాట       
ప్రకారంబు నరుడు పొందు రెండు - మరణముల్రానుండె మరణంబు
ముక్తికి - మార్గమైనందున మరణంబు ఆనంద - కరమైనస్థితి యాయె
నరకమను రెండవ-మరణంబు తప్పింప మరణ మొందను సిద్ధ- మై
యున్న రక్షకుని = మరణింప జేసిన - మానవుల యత్నాలు

 3.  తల మీదను హస్త - ముల యందున పాదముల యందును పార్శ్వ -
ముల యందును రక్త = ములు గారిన గాయ - ములును వేదన - బాధ                       

 4.  రాతి గోడలు నాలుగు - ప్రక్కలందుండగను మూతగ బండయు -
ముద్రయు వేయగను దూత వచ్చి రాయి - దొర్లించినప్పుడు
మా తండ్రి క్రీస్తు - మాధి యావత్తును

 5.  చావనై యున్నను - లేవనై యున్నట్టు వంచకుడు చెప్పె - జీవించి
యున్నప్పుడు కావున శిష్యుల - క్కడి శవము నెత్తుకొని పోవుదురప్పుడు
మొదటి వంచనకంటె వంచనయె చెడ్డ - దైవెల్లడగునని ఈవిధముగా
చెప్పిఈర్ష్యపరులు రాత్రి = కావలి పెట్టిన - ఘాటు జాగ్రత్తలు  

260. Hey Prabhu Yesu Hey Prabhu Yesu

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా పాపహరా శాంతికరా

1. శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి
శాంతి స్వరూపా జీవనదీపా శాంతి సువార్తనిధి 

2. తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెకదా
విఫలులు జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా 

3. మతములు వెదకిన నిన్నెగదా - వ్రతములు గోరిన నిన్నెగద
పతితులు దేవుని సుతులని చెప్పిన హితమతి నీవెగదా

4. పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగ కురిసెగదా
మలమలమాడిన మానవ హృదయము కలకలలాడెగదా

5. కానన తుల్య సమాజములో హీనత జెందెను మానవతా
మానవ మైత్రిని సిల్వపతాకము దానము జేసెగదా 

6. దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండెగదా
దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివిగదా 

7. పాపము చేసిన స్త్రీనిగని పాపుల కోపము మండెగదా
దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి నీవెగదా 

8. ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసితి నీవెగదా
ఖరమయుడగు సాతానుని గర్వము ఖండనమాయెగదా

259. Siluve Na Saranayenura

సిలువే నా శరణాయెనురా - నీ సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము జూచితిరా

1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా

2. సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు
నలిగి కరిగి నీరగు చున్నది రా

3. సిలువను దరచి తరచి విలువ కందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ జాలును రా

4. పలువిధ పదము లరసి ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా

5. శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా

258. Siluvalo Sagindi Yaathra Karunamayuni

సిలువలో సాగింది యాత్ర - కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరికోసమో - జగతి కోసమే - జనుల కోసమే

1. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో - జగతి కోసమే - జనుల కోసమే

2. చెళ్ళుమని కొట్టింది ఒకరు మోముపై ఊసింది మరియొకరు
బంతులాడినారు బాధలలో వేసినారు
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో - జగతి కోసమే - జనుల కోసమే

3. వెనుకనుంచి తన్నింది ఒకరు తనముందు నిలచి నవ్వింది మరియొకరు
గేలిచేసినారు పరిహాసమాడినారు
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో - జగతి కోసమే - జనుల కోసమే

4. దాహమని అడిగింది ప్రేమ చేదు దాహాన్ని ఇచ్చింది లోకం
చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో - జగతి కోసమే - జనుల కోసమే

257. Siluva Chentha Cherina Nadu

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి

1. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన పిలుచుచుండె పరముచేర

2. వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబది తొమ్మిది గొర్రెల విడచి - ఒంటరియైున గొర్రెను వెదకెన్

3. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రి యతని జేర్చుకొనెను

4. పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేర
పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతం

256. Rajulaku Rajaina Ee Mana Vibhuni

రాజులకు రాజైన యీ మన విభుని పూజ సేయుటకు రండి
యీ జయశాలి కన్న మనకింక రాజెవ్వరును లేరని

కరుణ గల సోదరుండై యీయన ధరణి కేతెంచెనయ్యా
స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు బరలోక రాజ్యమ్మును

నక్కలకు బొరియలుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను
ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను

అపహాసములు సేయుచు నాయన యాననముపై నుమియుచు
గృపమాలిన సైనికు లందరును నెపము లెంచుచు గొట్టిరి

కరమునందొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్‌
ధరణీపతి శ్రేషుడ నీకిపుడు దండమనుచును మ్రొక్కిరి

ఇట్టి శ్రమలను బొందిన రక్షకుని బట్టుదలతో నమ్మిన
అట్టహాసము తోడను బరలోక పట్టణంబున జేర్చును

శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము జేసెను
భక్తితో ప్రార్ధించిన మన కొసగు రక్తితో నా ముక్తిని

త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు
దరికి జేరిన వారిని మన ప్రభువు దరుమడెన్నడు దూరము

255. Yesu Chavonde Siluvapai

యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే

నదివలె యేసు రక్తము
సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు తుడిచె
ఆ ప్రశస్త రక్తమే

నే నీ పాపము లొప్పుకో
నీ పాప డాగులు తుడుచుకో
నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో
క్రీస్తు యేసు రక్తములో

పాప శిక్ష పొంద తగియుంటిమి
మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడె నీకై
అంగీకరించు యేసుని

254. Yesukristuni Siluva Epudu

యేసు క్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు
మాసతోను సోదరా = మన దోసంబు నెడబాపు
ఈ సంతాప మరణ - వ్యాసంబుచే సోదరా

ధీరుండై దీనుండై - ధారుణ్య పాప భారంబు
మోసెను సోదరా = తన్ను జేరిన వారిని
పారదోలనని - ఎవరు బల్కిరి సోదరా

ఎండచే గాయములు - మండుచు నుండెను
నిండు వేదన సోదరా = గుండె నుండి నీరుకారు
చుండె దుóఖించుచు - నుండు వేళను సోదరా

ఒళ్లంత రక్తము - ముళ్ళ కిరీటము
తలపై బెట్టిరి సోదరా = ఒకడు బళ్ళెంబుతో బొడవ
నీళ్ళు రక్తము గారె – చిల్లులాయెను సోదరా

కటకటా - పాప సంకటము బాపుట కింత
ఎటులోర్చితివి సోదరా = ఎంతో కఠిన హృదయంబైన
అటు చి తరచినా – కరగిపోవును సోదరా

పంచ గాయములు - నే నెంచి తలంచినా
వంచన యిది సోదరా = నన్ను వంచించు సైతాను
వల నుండి గావ తానెంచి బొందెను సోదరా

మరణమైనప్పుడు - ధరణి వణికెను గుడి
తెర చినిగెను సోదరా = ఉరు గిరులు బండలు బద్ద
లాయె సమాధులు - తెరువ బడెను సోదరా

253. Moodu Siluvalu Mosithiva Nakai

మూడు సిలువలు మోసితివా
నాకై మూడు - సిలువలు మోసితివా
మూడు సిలువలు మోసి మూడిటి వలన
గలుగు - కీడు సహించితివా ఆ కీడు నీ కాళ్ళ
క్రిందవేసి త్రొక్కి ఓడించి వేచితివా

లోక పాపములను - ఏకంబుగా
నీ పైకి వేసికొంటివా = నీకు ఆ
కాడి పెద్దదై - అధిక భారంబాయె
అది మొది సిలువాయెనా

లేని నేరములు నీ - పైన దుష్టులు
వేయగాను క్షమించితివా = నీకు
ఈ నేరములు గూడ - యెంతో భారంబాయె
ఇది రెండవ సిలు వాయెరా

కలుషాత్ములు కర్ర - సిలువ నీపై మోప
అలసిపోయి యుంటివా అట్లు
అలసి పోయిన మోయ - నని చెప్పకుంటివి
అది మూడవ సిలువాయెనా

నా నేరములు యేసు - పైన వేసికొన్న
నీ నెనరునకు స్తోత్రము = నీకు - నేను
చూపు ప్రేమ - నీ ప్రాణార్పణ - ప్రేమ నిధి
యెదుట ఏ మాత్రము

నా ఋణము తీర్చిన - నాదేవా నాప్రభువా
నీ ఋణము తీర్చగలనా = నీవు నా ఋషివై
బోధించి - నా బదులు చనిపోయి - నావని
మరువ గలనా

252. Basillenu Siluvalo Papa Kshama

భాసిల్లెను సిలువలో పాపక్షమ
యేసుప్రభూ నీ దివ్యక్షమ

కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను ఆహుతి జేసె
కలుషహరా కరుణించితివి          IIభాసిల్లెనుII

దోషము జేసినది నేనెగదా
మోసముతో బ్రతికిన నేనెగదా
మోసితివా నా శాప భారం          IIభాసిల్లెనుII

పాపము జేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి              IIభాసిల్లెనుII

నీ మరణపు వేదన వృధగాదు
నా మదివేదనలో మునిగె
క్షేమము కలిగిను హృదయములో IIభాసిల్లెనుII

ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని      IIభాసిల్లెనుII

నమ్మినవారిని కాదనవనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదమ్ములను     IIభాసిల్లెనుII