Index-Telugu

Saturday, 22 October 2016

265. Jayahe Jayahe Jayahe Jahaye

జయహే జయహే జయహే జయహే
జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా

 1. సిలువలో పాపికి విడుదల కలిగెను - విడుదల కలిగెను
     కలువరిలో నవ జీవన మొదవెను - జీవన మొదవెను
    సిలువ పతాకము జయమును గూర్చెను
    జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

2.  మరణపు కోటలో మరణమె సమసెను - మరణమె సమసెను
     ధరణిలో జీవిత భయములు తీరెను - భయములు తీరెను
     మరణములో సహ జయములు నావే
     జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

3.  శోధనలో ప్రభు సన్నిధి దొరికెను - సన్నిధి దొరికెను
     వేదనలే రణభూమిగ మారెను - భూమిగ మారెను
     శోధన బాధలు బలమును గూర్చెను
     జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

4.  ప్రార్ధన కాలము బహు ప్రియమాయెను - బహు ప్రియమాయెను
     సార్ధక మాయెను దేవుని వాక్యము - దేవుని వాక్యము
     ప్రార్ధనలే బలిపీఠములాయెను
     జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

5.  పరిశుద్ధాత్ముని ప్రాపకమొదవెను - ప్రాపకమొదవెను
     వరుడగు యేసుని వధవుగా మరితి - వధువుగా మారితి
     పరిశుద్ధుడు నను సాక్షిగ పిలిచెను
     జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

3 comments: