A Telugu Christian resource sharing devotional songs, sermons, and teachings with lyrics, audio, and video. Strengthen your faith, enjoy worship, and experience God’s Word.
Index-Telugu
Saturday, 22 October 2016
270. Veerude Lechenu Maranapu Mullunu Virachi
269. Vijaya Geethamu Manasara Nenu Padeda
విజయగీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు
పునరుత్థానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన
ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
పుటమువేసితివే నీ రూపము చూడ నాలో
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
నీ ఉత్తమమైన సంఘములో ||పునరు||
ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది ||పునరు||
నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో
యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే
నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||పునరు||
268. Randi Viswasulara
రండు విశ్వాసులారా-రండు విజయము
సూచించు - చుండెడు సంతోషంబును
గల్గి - మెండుగ నెత్తుడి రాగముల్
నిండౌ హర్షము మనకు – నియమించె దేవుడు
విజయం విజయం విజయం విజయం విజయం
నేటి దివస మన్ని యాత్మలకును
నీటగు వసంత ఋతువగును
వాటముగ చెరసాలను గెలిచె
వరుసగ మున్నాళ్ నిద్రించి = సూటిగ
లేచెన్ యేసు సూర్యుని వలెన్
విజయం విజయం విజయం విజయం విజయం
కన్ను కన్ను కానని చీకటి
కాలము క్రీస్తుని కాంతిచే - ఇన్నాళ్ళకు
శీఘ్రముగా బోవు - చున్నది శ్రీయేసుని
కెన్నాళ్ళ కాగని - మన సన్నుతుల్ భువిన్
విజయం విజయం విజయం విజయం విజయం
బలమగు మరణ ద్వార బంధములు
నిన్ బట్టకపోయెను - వెలుతురు
లేని సమాధి గుమ్మ - ములు నిన్నాపక
పోయెను గెలువ వాయెను
విజయం విజయం విజయం విజయం విజయం
పన్నిద్దరి లోపల నీ వేళ-సన్నుతముగ
నీవు నిలిచి-యున్నావు మానవుల
తెలివి - కెన్నడైన నందని = ఔన్నత్య
శాంతిని అనుగ్రహింతువు
విజయం విజయం విజయం విజయం విజయం
267. Yuda Raja Simham Thirigi Lechenu
యూదా రాజ సింహం - తిరిగి లేచెను
తిరిగి లేచెను - మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం - యేసుప్రభువే
యేసుప్రభువే - మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం - తిరిగి లేచెను
నరక శక్తులన్నీ - ఓడిపోయెను
ఓడిపోయెను - అవన్నీ రాలిపోయెను
యేసు లేచెనని -రూఢియాయెను
రూడియాయెను - సమాధి ఖాళీ ఆయెను
పునరుత్థానుడిక - మరణించడు
మరణించడు - మరెన్నడు మరణించడు
యేసు త్వరలో - రానైయున్నాడు
రానైయున్నాడు - మరల రానైయున్నాడు
266. Marananni Gelichina Deva Ninne Aradhinchedanayya
మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
ప్రాణముతో గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
అభిషేకనాధుడా నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
పరిశుద్ధమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
సింహాసనాసీనుడా నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
పరిపూర్ణమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
సర్వాధికారి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న