Index-Telugu

Monday, 22 January 2018

304. Yesunadhuni Chentha Cherumu

యేసునాధుని చెంత చేరుము
నీ దురంత వింత పాపమంత పోవును
యేసునాధుని చేరి వేడుము
నీదు హృదయమంత యేసు శాంతి నిండును
యేసే మార్గం సత్యం జీవం
రావా సోదరా సోదరీ జాలమేలరా

సిలువమ్రానుపై యేసు వ్రేలాడెన్
సకల లోక పాపమంత పరిహరించెను
సిలువ నీడలో యేసు తోడుగా
అవధి లేని ఆ ప్రేమ నిన్ను పిలువగా      ||రావా||

యేసుప్రేమలో సేద దీరుము
అలసినట్టి నీ మది విశ్రాంతి నొందును
యేసు ప్రేమలో నిలిచియుండుము
ఆ ప్రేమ నీలో ప్రభావింపగా                      ||రావా||

యేసు వెలుగును వెంబడించుము
యేసుబాటలో చీకటసలే యుండదు
యేసు వెలుగులో నడిచి వెళ్లుము
ఆ వెలుగు నీలో ప్రకాశింపగా                 ||రావా||

No comments:

Post a Comment