Index-Telugu

Monday, 22 January 2018

313. Hrudayamanedu thalupu nodda yesu nadhundu



                హృదయమనెడు తలుపునొద్ద యేసునాధుండు
                నిలిచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను

1.            పరునిబోలి నిలుచున్నాడు పరికించి చూడ
               నతడు పరుడు గాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు

2.            కరుణాశీలుండతడు గాన గాచియున్నాడు
               యేసు కరుణ నెరుగి గారవింప గలము న్యాయంబు

3.            ఎంతసేపె నిలువబెట్టి యేడ్పింతురతని
               నాతడెంతో దయతో బిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను

4.            అతడు మిత్రుడతడు మిత్రుడఖిల పాపులకు
               మీరలతని పిలుపు వింటిరేని యతడు ప్రియుడగును

5.            జాలిచేత తన హస్తముల జాపియున్నాడు
               మిమ్ము నాలింగనము సేయగోరి యనిశము కనిపెట్టు

6.            సాటిలేని దయగలవాడు సర్వేశ్వరసుతుడు
               తన మాట వినెడు వారినెల్ల సూిగ రక్షించు

7.            చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాధున్
               నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము గృపను

8.            అతడు తప్పక కలుగజేయు నఖిల భాగ్యములు
               మీర లతని హత్తుకొందురప్పు డానందము తోడ

9.            బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ 
               గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొల్వండి

3 comments: