Index-Telugu

Tuesday, 23 January 2018

335. Yesu Prabhuva Nenintha Kalamu

యేసుప్రభువ నేనింత కాలము
వృధా చేసితి నాజీవితమంతటిన్ అయ్యయ్యయ్యో

నా ఇష్టమే నా సౌఖ్యమే నా సొగసే నా స్నేహమే
ఇవియే నాకు ఘనమింని - అయ్యో మూర్ఖుడనై

నీ ఒసగిన దేహంబును నీ వరములన్ నీ జ్ఞానమున్
నీ సేవకై వాడనైతిన్ - ప్రభువా క్షమియించుము

నీ సిలువే నీ శ్రమలే నీ త్యాగమే నీ ప్రేమయే
ఇవియే నాకు శరణ్యమౌ - ప్రభువా రక్షణ్యమా

చాలునింకా నా ఇష్టము చాలునింకా లోకాశలు
ఇపుడే నే నీ వెంటవత్తున్ - ప్రభువా చేర్చుకొనుమా

No comments:

Post a Comment