Index-Telugu

Tuesday, 23 January 2018

337. Kshamiyinchumu O Prabhuva Padipothini Ninu Vidi



                క్షమియించుము ప్రభువా - పడిపోతిని నినువీడి
                నా హృదయమును కడిగి - పవిత్రుని చేయు ప్రభూ

 1.           నీ సన్నిధినే వదలి - అపవాదికి లోనైతి
               తెగిపోయిన పటమువలె - పయనించితి శూన్యములో

2.            నినువీడిన నా మనసు - వేసారెను వేదనతో
               చిగురించని మోడువలె - వాడెను నా జీవితము

 3.           కల్వరి రక్తములో - నను శుద్ధుని చేయుమయా
               కలుషములను ఎడబాపి - నిలుపుము నీ మార్గములో

 4.           నశియించిన నా ఆత్మన్‌ - రక్షించుము దేవా
               శుద్ధాత్మను నా కొసగి - నడుపుము నీ సత్యములో

 5.           నను దీక్షతో ప్రేమించి - నా కొరకై మరణించె
               నా పాపము హరియించు - నా భారము తొలగించు

 6.           నేనున్నది ప్రభులోనే - నా ప్రాణము ప్రభు కొరకే 
               నా కాపరి యేసేలే - నాకే కొదువను లేదు

2 comments: