Index-Telugu

Tuesday, 23 January 2018

351. Yehova Na Moranalinchenu Thana Mahadayanu Nanu Ganinchenu

యెహోవా నా మొరనాలించెను
తన మహాదయను నను గణించెను
అహర్నిశల దీనహీనుడగు
నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను

పిశాచకడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువబెట్టెను
ప్రశాంతమధుర సువిశేష
వాక్ఫల నిశాంతమున జేర్చి సేద దీర్చెను

మదావళము బోలు నామదిన్
దన ప్రదీప్త వాక్యం కునాహతిన్
యధేచ్ఛలన్ని గుదించి
పాపపు మొదల్ తుదల్ నరికి దరికి జేర్చెను

అనీతివస్త్ర మెడలించెను
యేసునాధు రక్తమున ముంచెను
వినూత్న యత్నమె తనూని యెన్నడు
గనన్ వినన్ ప్రేమ నాకు జూపెను

విలాపములకు చెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పైకిలాగి నను సుఖ
కళావళుల్ మనసులోన నిలిపెను

అగణ్య పాపియని త్రోయక
నను గూర్చి తన సుతుని దాచక
తెగించి మృతికొప్పగించి
పాపపు నెగుల్ తెగుల్ సొగసుగా వణంచెను

No comments:

Post a Comment