Index-Telugu

Tuesday, 23 January 2018

353. Yesu Prabhuve Niku Rakshana Nichunu

యేసుప్రభువే నీకు రక్షణ నిచ్చును
ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు

మృతియే పాపపు జీతము ప్రభుని వరము జీవము
క్రీస్తునంగీకరించిన - నిత్య జీవమిచ్చును
ప్రాణమున్ ఆ సిల్వపై బలిగానిడి నిన్ కొనెగదా
మరతువా యేసుని ప్రేమను మరువకు

కంటికి కనబడని వెన్నో - చెవికి వినబడని వెన్నో
గ్రహింప శక్యము గానివి - నీకై సిద్ధపరచెను
ప్రాణమున్ ఆ సిల్వపై బలిగానిడి నిన్ కొనెగదా
పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను

మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెను
మరణ భయములోనున్న - వారిని విడిపించెను
ప్రాణమున్ ఆ సిల్వపై బలిగానిడి నిన్ కొనెగదా
హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో

No comments:

Post a Comment