Index-Telugu

Tuesday, 27 February 2018

379. Nibhandhana Janulam Nirkshana Dhanulam

నిబంధనా జనులం
నిరీక్షణా ధనులం
ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం
మేము నిబంధనల జనులం
యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే
మోక్షమందు చేరెదము (2)           ||నిబంధనా||

అబ్రాహాము నీతికి వారసులం
ఐగుప్తు దాటిన అనేకులం (2)
మోషే బడిలో బాలురము (2)
యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

విశ్వాసమే మా వేదాంతం
నిరీక్షణే మా సిద్ధాంతం (2)
వాక్యమే మా కాహారం (2)
ప్రార్ధనే మా వ్యాయామం – అనుదినము
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

అశేష ప్రజలలో ఆస్తికులం
అక్షయుడేసుని ముద్రికులం (2)
పునరుత్థానుని పత్రికలం (2)
పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

నజరేయుని ప్రేమ పొలిమేరలో
సహించుటే మా ఘన నియమం (2)
క్షమించుటే ఇల మా న్యాయం (2)
భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

క్రీస్తేసే మా భక్తికి పునాది
పునరుత్థానుడే ముక్తికి వారధి (2)
పరిశుద్ధాత్ముడే మా రథ సారథి (2)
ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

ఎవరీ యేసని అడిగేవో
ఎవరోలే యని వెళ్ళేవో (2)
యేసే మార్గం యేసే జీవం (2)
యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం
నిబంధనా జనులం                   ||యేసు రాజు||

No comments:

Post a Comment