Index-Telugu

Tuesday, 27 February 2018

382. Maragamulanu Suchinchuvadu

మార్గములను సూచించువాడు
జీవితాలను వెలిగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు
యెహోవాయే నాకుండగా (2)
నేను సాధించలేనిది లేనే లేదు
జయించలేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు
విజయమెప్పుడూ నాదే (2)
ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ
జలములు నాపైకి లేచిననూ (2)
సంకెళ్లు నను బిగదీసిననూ
శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2)        ||నేను||

జీవితమంతా శూన్యమైననూ
బంధువులందరు నను విడచిననూ (2)
వ్యాధులెన్నో నను చుట్టిననూ
అడ్డంకులెన్నో నాకెదురైననూ (2)        ||నేను||

No comments:

Post a Comment