Index-Telugu

Tuesday, 27 February 2018

384. Andaru Nannu Vidachina

అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2)     ||అందరు నన్ను||

No comments:

Post a Comment