Index-Telugu

Tuesday, 27 February 2018

386. Anandam Mahanandam Na Priyuni Swaram Madhuram

ఆనందం మహానందం - నా ప్రియుని స్వరం మధురం

ముఖము మనోహారం - ప్రియుని ముఖము మనోహారం

నశియించిన పాపిని నేను - శాశ్వతమైన కృపజూపి

నా యేసుడెగా రక్షించెనుగా - నా ప్రభువును సేవింతునుగా

వేడుకతో విందుశాలకు నన్‌ - తోడుకు వెళ్ళును నా ప్రియుడు

కోరిన ఫలములు తినిపించును - కూరిమితో నా ప్రియ ప్రభువు

ఆనందభరితనై నేను - అతని నీడను కూర్చుందున

వాడబారను యేనాికి - వరదుని బాడుచు నుండెదను

ఎంతో ప్రేమతో ప్రేమించి - వింతగను నను ప్రభు దీవించె

అంతము వరకు యేసుని చెంతనే - నుందును ఆనందముతోను

రాజగు యేసు వచ్చునుగా - రాజ్యము నాకు తెచ్చునుగా

రాజ్యమునందు నే రాణిగాను - రమ్యముగ నేనుందునుగా

4 comments:

  1. అద్భుతమైన పాటలు.పిచ్చి పాటలు వస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి పాటలు అవసరం.

    ReplyDelete