Index-Telugu

Tuesday, 27 February 2018

392. Kannitiki Javabu Undi Nilo Vedana Thiripovunu

కన్నీటికి జవాబు ఉంది నీలో వేదన తీరిపోవును

యేసయ్య విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్ధన

నిను విడువను యెడబాయననీ.. పలికిన యేసే నీ తోడమ్మా

విలపించకు దిగులొందకు భయమెందకు కలత చెందకు

బూడిదకు ప్రతిగా పూదండతో అలంకరించును నిన్ను 

దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలం అభిషేకించును 

ఉల్లాస వస్త్రములు ధరియింప జేయును 

అవమానమునకు ప్రతిగా ఘనతొందెదవు 

భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రము

నీకొసగే వేళ ఇదే.. నీ కొసగే వేళ ఇదే

దేవుని మహిమ నీ పైన ఉదయించెను చూడుము

దేవునికి స్తోత్రములు చెల్లింతుము జయముగ హర్షింతుము

లెమ్ము తేజరిల్లు సంతోష గానముతో 

యేసుని నామమే బలమైన ఆశ్రయం

నా కృప నీకు చాలునని పలికెను 

ప్రభు యేసే ఆభరణం.. ప్రభు యేసే నీ కాభరణం 

No comments:

Post a Comment