Index-Telugu

Tuesday, 27 February 2018

396. Gadandhakaramlo Ne Nadachina Velalalo

గాఢాంధకారములో నే నడచిన వేళలలో
కంటిపాపవలె నన్ను కునుకక కాపాడును
ప్రభువైన యేసునకు జీవితమంతా పాడుదన్‌
జడియను బెదరను నా యేసు నాతోనుండగ

మరణంపు లోయలలో - నే నడచిన వేళలలో
నీ దుడ్డుకర్రయు నీ దండమాదరించును
నా గిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను
జడియను బెదరను నా యేసు నాతోనుండగ

అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగ
ప్రభుయేసు కృప నన్ను విడువక కాపాడును
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును
జడియను బెదరను నా యేసు నాతోనుండగ

No comments:

Post a Comment