Index-Telugu

Tuesday, 27 March 2018

415. Yesayya Ninnu Chudalanai Asa

యేసయ్యా.. నిన్ను చూడాలనీ ఆశ
మెస్సయ్యా.. నిన్ను చేరాలనీ ఆశ
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు నాతోడు రారు ఈ లోకంలో
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా

అందరు ఉన్నారనీ.. అందరు నా వారనీ
తలచితినీ భ్రమసితినీ
చివరికి ఒంటరి నేనైతిని
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా

అంధకారంలో.. అంధుడ నేనైతినీ
నినుచూసే నేత్రములు
నాకొసగుమా నజరేయుడా
నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా
నా శ్వాస నీవయ్యా నా భాష నీవయ్యా

No comments:

Post a Comment