Index-Telugu

Tuesday, 27 March 2018

419. Yesu Raju Ninnu Pilichenu Premathoda Ninnu Korenu

యేసురాజు నిన్ను పిలిచెను
ప్రేమతోడ నిన్ను కోరెను
కాలయాపనేల క్రైస్తవా
క్రీస్తుకొరకు పంట కూర్చవా

నిర్విచార రీతి నెట్లు నేల నిలుతువు
నిన్ను పిలుచు క్రీస్తు స్వరము నాలకించవా
క్రీస్తునాధుని తోటి కార్మికుండవై
కలసి నడచుటెంత ఘనతరా

యేసు నెరుగనట్టి తోటి యువకులెందరో
వ్యర్ధమైన పంటగా నశించు నుండగా
చూచుచుందువా నీదు సాక్ష్యమియ్యవా
భార రహితమేల క్రైస్తవా

కన్నులెత్తి పొలము నీవు పారచూడరా
తెల్లవారి కోతకొరకు సిద్ధమాయెను
విత్తువాడును కోత కోయువాడును
సంతోషించు తరుణమాయెరా

No comments:

Post a Comment