Index-Telugu

Tuesday, 27 March 2018

429. Parama Devunde Na Pakshamai Yundaga Narudemi Cheyagaladu

పరమదేవుండె నా పక్షమైయుండగా
నరుడేమి చేయగలడు ఆ
పరమజనకుండే నా - పట్టైయుండగ
పాప - నరుడేమి చేయగలడు

రక్షకుండె నా పక్షమై యుండగ
శిక్షించువాడెవ్వడు - నన్ను
రక్షించు నా ప్రభువె నా - శిక్ష పొందగ
నన్ను – భకించువాడెవ్వడు

దైవాత్మయే నా తనువులో నుండ
సై - తానింకేమి చేయును ఆ
జీవాత్మయే నా - జీవమైయుండగ
నిర్జీవుడేమి చేయును

దైవదూతలె నా - దరిని నుండగ నన్ను
దయ్యాలేమి చేయును
సావధానంబుగ కావలియుండ
పిశాచులేమి చేయును

కీడు కేవలము కీడంచు భావించి
ఖిన్నుడనై పోదునా
ఆ కీడు చాటున ప్రభువు క్రీస్తు
దాచిన మేలు చూడకుండగ నుందునా

శత్రువులెల్ల నను జంపజూచిన లే
శంబైన నేజడియును - నా మిత్రులౌ
భక్తుల మేలైన ప్రార్ధనల్
మించున్ ధైర్యము విడువన్

No comments:

Post a Comment