Index-Telugu

Wednesday, 4 April 2018

487. Loyalella Pudchabadali Kondalu Konalu Kadalipovali

లోయలెల్ల పూడ్చబడాలి
కొండలు కోనలు కదలిపోవాలి
వక్రమార్గము సక్రమవ్వాలి
కరకు మార్గం నునుపవ్వాలి ||2||
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం

ఫలం ఇవ్వని చెట్టులెల్ల
నరకబడి - అగ్నిలో వేయబడును
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం

గోధుమలను వేర్పరచి గింజలను చేర్చి
పొట్టును నిప్పులో కాల్చి వేయును
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం

పరిశుద్ధులుగా కక్ష్యలు లేక
ప్రభుకై జీవించి సాగిపోదాం
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం

రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం  
అభిషేక తైలముతో నింపబడెదం
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం

2 comments: