Wednesday 23 October 2019

526. Rajyalanele Maharaju (Christmas Song)

రాజ్యాలనేలే మహారాజు
రాజుగా నిన్ను చూడాలని (2)
సింహాసనాన్ని విడిచి ఇలలో
సామాన్యునిగా అరుదెంచెన్ (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే
పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే (2)
చీకటినంత పారద్రోల
పావనుడా పవళించావు
ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప
నీతి సూర్యుడా ఉదయించావు          ||హ్యాప్పీ||
తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు
బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో (2)
గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు
పరవిశించిరి నీ రాకతో
ఆనందమాయెను ఈ జగమంతా
రక్షకుడా నీ జన్మతో          ||హ్యాప్పీ||

No comments:

Post a Comment

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...