Index-Telugu

Tuesday, 10 November 2020

556. Stutinchina satanu paripothadu

స్తుతించిన సాతాన్ పారిపోతాడు
కునికితే తిరిగివస్తాడు (2)
స్తుతించి పాడి - కోటను కూల్చెదం
స్తుతుల శక్తితో యెరికో పట్టెదం (2)

దావీదు పాడగా సౌలుకు విడుదల (2)
కలతలు తీరెను నెమ్మది దొరికెను (2)
స్తుతించి పాడి - కోటను కూల్చెదం
స్తుతుల శక్తితో యెరికో పట్టెదం (2)

స్తుతించు దావీదుకు - ధైర్యము నిండెను (2)
విశ్వాసవాక్కుతో - గొల్యాతును గెల్చెను (2)
స్తుతించి పాడి - కోటను కూల్చెదం
స్తుతుల శక్తితో యెరికో పట్టెదం (2)

గొర్రెలకాపరి - రాజుగా మారెను (2)
ఆరాధనా వీరునికి - ప్రమోషన్ దొరికెను (2)
స్తుతించి పాడి - కోటను కూల్చెదం
స్తుతుల శక్తితో యెరికో పట్టెదం (2)

చేప కడుపులో - యోనా స్తుతించెను (2)
విడుదల పొంది - నీనెవె చేరెను (2)
స్తుతించి పాడి - కోటను కూల్చెదం
స్తుతుల శక్తితో యెరికో పట్టెదం (2)

పెదవిపై స్తుతులూ - చేతిలో వాక్యం (2)
స్వార్ధం నలుగగొట్టి - జయమును పొందెదం (2)
స్తుతించి పాడి - కోటను కూల్చెదం
స్తుతుల శక్తితో యెరికో పట్టెదం (2)

Wednesday, 2 September 2020

555. Sarvanga Sundara

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2)
నా ప్రార్థన ఆలకించువాడా
నా కన్నీరు తుడుచువాడా (2)
నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా (2)           ||సర్వాంగ||
నా శాపములు బాపినావా
నా ఆశ్రయ పురమైతివా (2)
నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
నాకు న్యాయము తీర్చితివా (2)         ||సర్వాంగ||
నా అక్కరలు తీర్చినావా
నీ రెక్కల నీడకు చేర్చినావా (2)
నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై
నాకు జయ ధ్వజమైతివా (2)          ||సర్వాంగ||

554. Aanadinchandi Andaru Aanandichandi (Christmas Song)



ఆనందించండి అందరు ఆనందించండి
ఆరాధించండి  అందరు ఆరాధించండి
చప్పట్లు కొట్టి గొంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి (2)
రక్షణ క్రీస్తుడి కీర్తించండి 
గుడ్డివారు కళ్లారా చూస్తున్నారు..
చెవిటివారు చెవులారా వింటున్నారు..(2)
మూగవారు మనసారా పాడుతున్నారు
కుంటివారు ఆశతీర ఆడుతున్నారు
యేసురాజు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు (4)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

కుల పిచ్చొలు కళ్ళు తెరుచుకున్నారు
మత ముచ్చొలు మనసు మార్చుకున్నారు (2)
దైవ మానవ సమసమాజం అన్నారు
దేవుని రాజ్యం దిగివచ్చిందని అన్నారు
యేసురాజు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు (4)

Tuesday, 16 June 2020

553. Yesu Nee Matalu

యేసు నీమాటలు-నాజీవితానికి క్రొత్తబాటలు 
నాపాదములకు దీపం నాత్రోవలకు వెలుగు 
నీవాక్యమే నన్నుబ్రతికించెను 
నావారునన్నునిందించి అపహసించగ
ఏత్రోవలేక తిరుగుచుండగ "2"
నీహస్తముతో ఆదరించితివి
నీకౌగిలిలో హత్తుకొంటివి "2" "యేసు
నీ శిలువ రక్తముతో నన్నుశుద్దిచేసి
నీరాజ్యములో చేర్చుకొంటివి "2"
నీవాక్యముతో బలపరచితివి..
నీ సువార్త చాటింప భాగ్యమిచ్చితివి

Tuesday, 19 May 2020

552. Inthalone Kanabadi Anthalone Mayamayye

ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
అల్పమైన దానికా ఆరాటం
త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి
స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2)
బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా
అంతరించిపోయెను భువినేలిన రాజులు (2)
నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా  
మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)
ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో 

Monday, 23 March 2020

551. Kalvari Giripai Siluva Baram

కల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా (2)
దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా (2)       ||కల్వరి||
మూడు దినములు సమాధిలో
ముదము తోడ నిద్రించితివా (2)
నా రక్షణకి సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2)   ||కల్వరి||
ఆరోహణమై వాగ్ధానాత్మన్
సంఘము పైకి పంపించితివా (2)
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను (2)         ||కల్వరి||

550. Kalamulatho Rayagalama

కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగాలమా
నీ మహోన్నతమైన ప్రేమా (2)
ఆరాధింతును (4)
రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను (2)
ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)     ||ఆరాధింతును||
సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)      ||ఆరాధింతును||

549. Kannillatho Pagiligina Gundetho

కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2)
విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2)
విడువడు నిన్ను
రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా
నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా           ||విడువడు||
అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా
శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా        ||విడువడు||

548. Kanuchupu Meralona

నేనున్నా నీతో అంటూ
నా చెంతకు చేరావు
యేసయ్యా.. యేసయ్యా…
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2)
మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2)
పని పూర్తి చేయగ బలము లేని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2)
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2)
స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2)
కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2)
అడుగేసి సాగగ అనువుకాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2)         ||కనుచూపు||

547. O Prabhuva O Phrabhuva

ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4)     ||ఓ ప్రభువా||
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

546. Oka varamadigithini Yesayya

ఒక వరమడిగితిని యేసయ్యా
నీలా ఉండాలని – మండుచుండాలని
నీలా ఉండాలని – మండుచుండాలని (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)  ||ఒక ||
నాలో నేరము స్థాపించగలరా
ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2)
నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు
నీ మార్గములలో నడిపించవా (2)       ||ఒక ||
సర్వ సృష్టికి సర్వాధికారి
తల వాల్చుటకును స్థలమింత లేదా (2)
నేను లోకాశ విడచి పైనున్నవాటి
గురి కలిగి వెదకి పొందాలని (2)       ||ఒక ||
తండ్రిని విడచి పారమును వీడి
నన్ను సమీపించినావు (2)
నేను కలిగున్నదంత నీ పాదాల చెంత
అర్పించి నీ చెంత చేరాలని (2)       ||ఒక ||
దేవుని చిత్తము సంపూర్తి చేయగ
సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2)
నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో
నీ సాక్షిగా జీవించాలని (2)       ||ఒక ||

545. O Manava Nee Papam Manava

ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీ బ్రతుకు మార్చవా (2)
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2)  ||ఓ ||
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2)  ||ఓ ||
ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2) ||ఓ ||

544. Mellani Challani Swaramu Yesayyadi

మెల్లని చల్లని స్వరము యేసయ్యదే
ఉల్లమంతటిని నింపు ఆనందము
అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్       ||మెల్లని||
శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా
మంచిదంతటిని మాటతో చేసెను
పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము
పావనపరచెడి పరిశుద్ధుని స్వరము               ||మెల్లని||
స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున
దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం
కుళ్ళిన శవమునందు జీవమును పోసెను
పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో       ||మెల్లని||
గాలి తుఫానులన్ అణచిన స్వరమది
భీతి భయములన్ని బాపెడి స్వరమది
అంత్య దినమందున మృతుల లేపునుగా
అందరికి తీర్పును తీర్చి పాలించును            ||మెల్లని||
మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను
మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను
మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా
మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా ||మెల్లని||

543. Raare Chuthamu Raja Suthuni

రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను (2)
రాజులకు రారాజు మెస్సయ్యా (2)
రాజితంబగు తేజమదిగో (2)    ||రారే||
దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగె-నీ దినమున (2)    ||రారే||
కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానదే తేజరిల్లెడి (2)
తార గాంచరే త్వరగ రారే (2)    ||రారే||
బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాలవృద్ధుల (2)
నేల గల్గిన నాథుడు (2)    ||రారే||
యూదవంశము నుద్ధరింప
దావీదుపురమున నుద్భవించె (2)
సదమలంబగు మదిని గొల్చిన (2)
సర్వ జనులకు సార్వభౌముడు (2)    ||రారే||

542. Sangeetha Nadamutho Stothra Sankeerthanatho

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద
నీ గోప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయ్యా
ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత||

నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)
పాపములు క్షమియించి నను మార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ||

నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
విడువక నడిపించిన విధమును వివరించెద (2)
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ||

నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2)
వాక్యముతో దర్శించి బలపరిచిన
సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||

541. Veenulaku Vindulu Chese

వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా..
వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||

రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||

రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||

సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||

Friday, 20 March 2020

540. Evaru Samipinchaleni Tejassutho

ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2)
ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి (2)
నీవీచుచు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2)         ||ఏమౌ||
పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2)      ||ఏమౌ||
జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌ||

539. Aashirvadamul Maa Mida

ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము
నీ సత్య వాగ్దత్తము
ఇమ్మాహి మీద
క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా
ఓ దేవా పంపింపవయ్యా
నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్      || ఇమ్మాహి ||
మా మీద కురియించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద
క్షామంబు పోనట్లుగన్        || ఇమ్మాహి ||
ఈనాడే వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి
సన్నుతి బ్రౌర్ధింతుము     || ఇమ్మాహి ||

538. Arambamayyindi Restoration

ఆరంభమయ్యింది రెస్టోరేషన్
నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2)
నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసం
నా ప్రభువు సమకూర్చి దీవించులే
మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు
ఇకముందు నా చేత చేయించులే
మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్
కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్
రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలు
నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి
మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్
కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్       
మేం శ్రమనొందిన దినముల కొలది
ప్రభు సంతోషాన్ని మాకిచ్ఛును
మా కంట కారిన ప్రతి బాష్ప బిందువు
తన బుడ్డిలోన దాచుంచెను
సాయంకాలమున ఏడ్పు వచ్చినను – ఉదయము కలుగును
తోట నవ్వు పుట్టును – మాకు వెలుగు కలుగును
దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు – మామ్మాదరించును
కీడు తొలగజేయును – మేలు కలుగజేయును   
మా పంట పొలముపై దందా యాత్ర చేసిన
ఆ ముడతలను ప్రభువాపును
చీడ పురుగులెన్నియో తిని పారువేసిన
మా పంట మరలా మాకిచ్చును
నా జనులు ఇక సిగ్గునొందరంటు – మా ప్రభువు చెప్పెను
అది తప్పక జరుగును – కడవరి వర్షమొచ్చును
క్రొత్త ద్రాక్షా రసము ఆహా మంచి ధాన్యములతో – మా కోట్లు నింపును
క్రొత్త తైలమిచ్చ్చును – మా కొరత తీర్చును    
పక్షి రాజు వలెను మా యవ్వనమును
ప్రభు నిత్య నూతనం చేయును
మేం కోల్పోయిన యవ్వన దినములను
మరలా రెట్టింపుగా మాకిచ్చును
అరె..వంద ఏళ్ళు అయినా మా బలము విరుగకుండా – సారమిచ్చును
జీవ ఊటనిచ్చును జీవజలమునిచ్చును
సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు – శక్తినిచ్చును
ఆత్మ వాక్కునిచ్చును – మంచి పుష్టినిచ్చును 
మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్లిన
మా సొత్తు మాకు విడిపించును
మోసకారి మోసము మేము తిప్పి కొట్టను
ఆత్మ జ్ఞానముతో మేము నింపును
అరె అంధకారమందు రహస్య స్థలములోని – మరుగైన ధనముతో
మమ్ము గొప్ప చేయును – దొంగ దిమ్మ తిరుగును
దొంగిలించలేని పరలోక ధనముతోటి – తృప్తిపరచును
మహిమ కుమ్మరించును – మెప్పు ఘనతనిచ్చును   
మా జీవితాలలో దైవ చిత్తమంతయు
మేము చేయునట్లు కృపనిచ్చును
సర్వ లోకమంతటా సిలువ వార్త చాటను
గొప్ప ద్వారములు ప్రభు తెరచును
అరె అపవాది క్రియలు మేం లయముచేయునట్లు – అభిషేకమిచ్చును
ఆత్మ రోషమిచ్చును – క్రొత్త ఊపునిచ్చును
మహిమ కలిగినట్టి పరిచర్యచేయునట్లు – దైవోక్తులిచ్చును
సత్య బోధనిచ్చును – రాజ్య మర్మమిచ్చును     

537. Agaka Saguma Sevalo Sevaka

ఆగక సాగుమా
సేవలో ఓ.. సేవకా
ఆగక సాగుమా
సేవలో సేవకా (2)
ప్రభువిచ్చిన పిలుపును
మరువక మానక (2)        ||ఆగక||
పిలిచినవాడు ప్రభు యేసుడు
ఎంతైనా నమ్మదగినవాడు (2)
విడువడు నిన్ను ఎడబాయడు
నాయకుడుగా నడిపిస్తాడు (2)        ||ఆగక||
తెల్లబారిన పొలములు చూడు
కోత కోయను సిద్ధపడుము (2)
ఆత్మల రక్షణ భారముతో
సిలువనెత్తుకొని సాగుము (2)        ||ఆగక||

Friday, 6 March 2020

536. Manoharuda Padivelalo Athi Sundaruda



మనోహరుడా పదివేలలో అతి సుందరుడా
మహావీరుడా భువనాలనేలే బలశూరుడా
ఎంతని నేను వివరించగలను
భువియందు దివియందు నీ మహిమను
ఎవరిని నీతో సరిపోల్చగలను
తలవంచి స్తుతియించి కీర్తించగ
నిన్నే ఆరాధించెదను - నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై అభివాదము IIమనోహరుడాII
గోపరసమంత సువాసన నీకే సొంతమైనది
అడవిలో జల్దరు  వృక్షముల అతికాంక్షనీయుడా
ఏన్గెది ద్రాక్ష వనమందున - కర్పూర పుష్పాల  సమానుడా
నాకెదురుగా నీవు నిలిచావని
నిన్నే ఆరాధించెదను - నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై అభివాదము IIమనోహరుడాII
ఆరని మారని ప్రేమను నాపై చూపినావు
వీడని నీడగ నీ కృపను ధ్వజముగా నిలిపినావే
మోడైన నా గోడు వినిపించగా - నా తోడుగా
నీవు నిలిచావుగా
నిన్నే ఆరాధించెదను - నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై అభివాదము IIమనోహరుడాII
కొండలు మెట్టలు దాటుచూ - ప్రియుడేతెంచువేళ
పావుర స్వరము దేశమున వినిపించుచున్నది
పైనుండి శక్తిని పొందేందుకు నీ సన్నిధిలో నేనుందును
ఆనంద తైలముతో నను నింపిన
నిన్నే ఆరాధించెదను - నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై అభివాదము IIమనోహరుడాII
పచ్చిక బయల్లే నీవు నేను కలిసే చోటనీ నీ మందిరములో ప్రతిదినము నే వేచియుందును
వనవాసాలెన్ని అడ్డొచ్చినా - మానవాసమెపుడూ మారదులే
నా మార్గదర్శివి నీవై నడిపించిన
నిన్నే ఆరాధించెదను - నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై అభివాదము IIమనోహరుడాII

Saturday, 1 February 2020

535. Epatidananaya Nanninthaga Hechinchutaku


ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు
నేనంతటి దాననయ నాపై కృప చూపుటకు " 2"
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి " 2"
ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది
కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు " 2"
అందరు నను విడచిన నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా "ప్రేమించే"
నీ ప్రేమను మరువలేనయా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత " 2"
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా "ప్రేమించే"


534. Neeve Krupadharamu Triyeka Deva


నీవే కృపాధారముత్రియేక దేవా

నీవే క్షేమాధారము నా యేసయ్యా /2/

నూతన బలమును నవ నూతన కృపను /2/

నేటివరకు దయచేయుచున్నావునిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా

స్తోత్ర గీతము నీకేనయ్యా .. /నీవే/

ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను /2/

ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి /2/

ఆపదలెన్నో అలముకున్ననుఅభయము నిచ్చితివి

ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి

ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు

నీకే ప్రేమగీతం అంకితమయ్యా

స్తోత్ర గీతం అంకితమయ్యా /2/నీవే/

సర్వకృపానిధిసీయోను పురవాసినీ స్వాస్థ్యముకై నను పిలచితివి /2/

సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదనుసహనము కలిగి /2/

శిధిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి

సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి

సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు

నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా స్తోత్ర గీతము నీకేనయా /నీవే/

ప్రాకారములను దాటించితివిప్రార్ధన వినెడి పావనమూర్తివి /2/

పరిశుద్ధులతో నను నిలిపితివినీ కార్యములను నూతన పరచి /2/

పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి

పరామరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి

పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు

నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా స్తోత్ర గీతము నీకెనయా /నీవే/