Friday, 20 March 2020

540. Evaru Samipinchaleni Tejassutho

ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2)
ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి (2)
నీవీచుచు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2)         ||ఏమౌ||
పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2)      ||ఏమౌ||
జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌ||

No comments:

Post a Comment

Naa Sarvamu Prabhuke Ankitham Lyrics - Telugu Christian Song 607

నా సర్వము ప్రభుకే అంకితం నా సర్వము ప్రభుకే అంకితం నా సర్వము ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం ...