Index-Telugu

Tuesday, 3 August 2021

569. Nenante Neekenduko Ee Prema

నేనంటే నీకెందుకో ఈ ప్రేమా
నన్ను మరచి పొవెందుకు (2)
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
నన్ను విడిచిపోవెందుకు
కష్టాలలో నష్టాలలో
వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో
వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు
ప్రాణమా.. నా ప్రాణమా – (2)      ||నేనంటే||

నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు
నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను                ||నేనంటే||

ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు
మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)
ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను                ||నేనంటే||

1 comment: