Index-Telugu

Wednesday, 22 May 2024

580. Neelone Anandam Na Deva

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంత నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2)

ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను
ఏది నా సొంతం కాదనుకున్నాను (2)
తప్పిపోయిన కుమారుని నేనయితే
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2) II ఈ లోకమంతII

ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా
ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2)
నన్ను మరువని ప్రేమ నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2) II ఈ లోకమంతII

No comments:

Post a Comment