Index-Telugu

Monday, 15 July 2024

583. Nenante Entha Premo Aa Prema Moorthiki

నేనంటే ఎంత ప్రేమో ఆ ప్రేమ మూర్తికి
నా కొరకే సిలువనెక్కే నా కలువరినాధునికి
యేసు రక్తమే జయం - సిలువ రక్తమే జయం యి II 4 II

కలువరి రుధిరములో కడుగబడిన శిలను 
నీ రక్త ప్రవాహములో సిలువ చెంత చేరాను 
నీ ప్రేమే మార్చిందయా... నన్నిలా.. 
ఆ ప్రేమకు బానిసగా మారానయ్యా II 2 II నేనంటే II

నను రక్షించుటకు నీ ప్రాణమర్పింప
వెనుకాడలేదుగా నా యేసయ్య
నా శిక్ష భరియించి శాపము తొలగించి
నా స్థానములో నీవు బలియైతివా
ప్రియమని ఎంచలేదుగా నీ ప్రాణమును
నా ఆత్మ విలువ నీవు యోచించితివా II 2 II నేనంటే II

No comments:

Post a Comment