Wednesday, 7 September 2016

259. Siluve Na Saranayenura

సిలువే నా శరణాయెనురా - నీ సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము జూచితిరా

1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా

2. సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు
నలిగి కరిగి నీరగు చున్నది రా

3. సిలువను దరచి తరచి విలువ కందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ జాలును రా

4. పలువిధ పదము లరసి ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా

5. శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా

258. Siluvalo Sagindi Yaathra Karunamayuni

సిలువలో సాగింది యాత్ర - కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరికోసమో - జగతి కోసమే - జనుల కోసమే

1. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో - జగతి కోసమే - జనుల కోసమే

2. చెళ్ళుమని కొట్టింది ఒకరు మోముపై ఊసింది మరియొకరు
బంతులాడినారు బాధలలో వేసినారు
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో - జగతి కోసమే - జనుల కోసమే

3. వెనుకనుంచి తన్నింది ఒకరు తనముందు నిలచి నవ్వింది మరియొకరు
గేలిచేసినారు పరిహాసమాడినారు
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో - జగతి కోసమే - జనుల కోసమే

4. దాహమని అడిగింది ప్రేమ చేదు దాహాన్ని ఇచ్చింది లోకం
చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో - జగతి కోసమే - జనుల కోసమే

257. Siluva Chentha Cherina Nadu

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి

1. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన పిలుచుచుండె పరముచేర

2. వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబది తొమ్మిది గొర్రెల విడచి - ఒంటరియైున గొర్రెను వెదకెన్

3. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రి యతని జేర్చుకొనెను

4. పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేర
పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతం

256. Rajulaku Rajaina Ee Mana Vibhuni

రాజులకు రాజైన యీ మన విభుని పూజ సేయుటకు రండి
యీ జయశాలి కన్న మనకింక రాజెవ్వరును లేరని

కరుణ గల సోదరుండై యీయన ధరణి కేతెంచెనయ్యా
స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు బరలోక రాజ్యమ్మును

నక్కలకు బొరియలుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను
ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను

అపహాసములు సేయుచు నాయన యాననముపై నుమియుచు
గృపమాలిన సైనికు లందరును నెపము లెంచుచు గొట్టిరి

కరమునందొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్‌
ధరణీపతి శ్రేషుడ నీకిపుడు దండమనుచును మ్రొక్కిరి

ఇట్టి శ్రమలను బొందిన రక్షకుని బట్టుదలతో నమ్మిన
అట్టహాసము తోడను బరలోక పట్టణంబున జేర్చును

శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము జేసెను
భక్తితో ప్రార్ధించిన మన కొసగు రక్తితో నా ముక్తిని

త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు
దరికి జేరిన వారిని మన ప్రభువు దరుమడెన్నడు దూరము

255. Yesu Chavonde Siluvapai

యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే

నదివలె యేసు రక్తము
సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు తుడిచె
ఆ ప్రశస్త రక్తమే

నే నీ పాపము లొప్పుకో
నీ పాప డాగులు తుడుచుకో
నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో
క్రీస్తు యేసు రక్తములో

పాప శిక్ష పొంద తగియుంటిమి
మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడె నీకై
అంగీకరించు యేసుని

254. Yesukristuni Siluva Epudu

యేసు క్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు
మాసతోను సోదరా = మన దోసంబు నెడబాపు
ఈ సంతాప మరణ - వ్యాసంబుచే సోదరా

ధీరుండై దీనుండై - ధారుణ్య పాప భారంబు
మోసెను సోదరా = తన్ను జేరిన వారిని
పారదోలనని - ఎవరు బల్కిరి సోదరా

ఎండచే గాయములు - మండుచు నుండెను
నిండు వేదన సోదరా = గుండె నుండి నీరుకారు
చుండె దుóఖించుచు - నుండు వేళను సోదరా

ఒళ్లంత రక్తము - ముళ్ళ కిరీటము
తలపై బెట్టిరి సోదరా = ఒకడు బళ్ళెంబుతో బొడవ
నీళ్ళు రక్తము గారె – చిల్లులాయెను సోదరా

కటకటా - పాప సంకటము బాపుట కింత
ఎటులోర్చితివి సోదరా = ఎంతో కఠిన హృదయంబైన
అటు చి తరచినా – కరగిపోవును సోదరా

పంచ గాయములు - నే నెంచి తలంచినా
వంచన యిది సోదరా = నన్ను వంచించు సైతాను
వల నుండి గావ తానెంచి బొందెను సోదరా

మరణమైనప్పుడు - ధరణి వణికెను గుడి
తెర చినిగెను సోదరా = ఉరు గిరులు బండలు బద్ద
లాయె సమాధులు - తెరువ బడెను సోదరా

253. Moodu Siluvalu Mosithiva Nakai

మూడు సిలువలు మోసితివా
నాకై మూడు - సిలువలు మోసితివా
మూడు సిలువలు మోసి మూడిటి వలన
గలుగు - కీడు సహించితివా ఆ కీడు నీ కాళ్ళ
క్రిందవేసి త్రొక్కి ఓడించి వేచితివా

లోక పాపములను - ఏకంబుగా
నీ పైకి వేసికొంటివా = నీకు ఆ
కాడి పెద్దదై - అధిక భారంబాయె
అది మొది సిలువాయెనా

లేని నేరములు నీ - పైన దుష్టులు
వేయగాను క్షమించితివా = నీకు
ఈ నేరములు గూడ - యెంతో భారంబాయె
ఇది రెండవ సిలు వాయెరా

కలుషాత్ములు కర్ర - సిలువ నీపై మోప
అలసిపోయి యుంటివా అట్లు
అలసి పోయిన మోయ - నని చెప్పకుంటివి
అది మూడవ సిలువాయెనా

నా నేరములు యేసు - పైన వేసికొన్న
నీ నెనరునకు స్తోత్రము = నీకు - నేను
చూపు ప్రేమ - నీ ప్రాణార్పణ - ప్రేమ నిధి
యెదుట ఏ మాత్రము

నా ఋణము తీర్చిన - నాదేవా నాప్రభువా
నీ ఋణము తీర్చగలనా = నీవు నా ఋషివై
బోధించి - నా బదులు చనిపోయి - నావని
మరువ గలనా

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...