🎵 Telugu Christian Songs – Lyrics, Worship Music & MP3 Downloads
A Telugu Christian resource sharing devotional songs, sermons, and teachings with lyrics, audio, and video. Strengthen your faith, enjoy worship, and experience God’s Word.
నా సర్వము ప్రభుకే అంకితం
నా జీవితం ప్రభుకే అంకితం
నా యేసుని స్వరమే వినబడే
నా భాగ్యమాయెను
నా సర్వము ప్రభుకే అంకితం
నా జీవితం ప్రభుకే అంకితం
హల్లెలూయా…..
కల కాదు నిజముగానే కనబడెను నా ప్రభువు
ఈ భువిలో అదియే భాగ్యము (2)
తృణమైన నా బ్రతుకు దేదీప్యమై
ఋణమాయే నా మనసు ప్రభు ప్రేమకు
నా వరమే ఈ దినమే ||నా సర్వము||
అపురూపం ప్రభు రూపం దయనీయం ప్రతి చూపు
దేదీప్యమై వెలిగే ప్రార్ధనే (2)
వివరించి పాడాలి ప్రతి వేళలో ప్రచురించి తెలపాలి ప్రతివారికి
నా ప్రియమై నా యేసుకై ||నా సర్వము||
నాపైన చూపావు నీకనికరం
కౌగిటిలో దాచావు గతవత్సరం
స్తుతియించగా నిన్ను ఈ నా స్వరం
బలపరచి నిలిపితివి ప్రతీ దినం
కృప చూపావుగా నా యెడా
ఇల నిలిపావు నా మనుగడ
ఇక నీకొరకు నే బ్రతుకగా
నాకు సరిపోయినా దేవుడా
యేసయ్య నా దేవా నీకె నా ఆరాధనా
యేసయ్య నా దేవా నీకె ఈ సంకీర్తన
మరుగొల్పు లోకములో నేనుండగా
లోకేచ్చలనుమాయలో జారగా
నీ కరము చాపి నను మరల లేపి
ప్రియ సుతునిగా నన్ను నిలిపావుగ 2
పాపము బాపి సిలువ సాక్షిగా
గతము మార్చావు నూతన సృష్టిగా 2
కృపా కనికరము గలిగినా దేవుడా
నీ ప్రేమతో నను నిలిపినా నాథుడా 2
యేసయ్య నా దేవా నీకె నా ఆరాధనా
యేసయ్య నా దేవా నీకె ఈ సంకీర్తన
ఫలియించుటే తెలియనీ బ్రతుకుకు
ఫలభరితముగ మారు కృపనిచ్చితివి
పరిశుద్దాత్మ ద్వారా నను నీలో నిలిపి
నీ ఆత్మ ఫలములతో నను నింపితివి 2
వాడబారని స్వాస్థ్యమే నా గురి
అది పొందుటకు చేరితి నీ దరి 2
కృపా కనికరముగలిగినా దేవుడా
నీ ఆత్మతో నను నింపినా నాథుడా. 2
యేసయ్య నా దేవా నీకె నా ఆరాధనా
యేసయ్య నా దేవా నీకె ఈ సంకీర్తన
సీయోను పురములో చూడాలి
యుగయుగములు పరవసించాలని
శ్రమలోన నీకొరకు నిలవాలనే పిలుపు
నడిపించుచున్నది నను నిత్యము 2
బ్రతికెదను నేను నిసాక్షిగా
విడిచెదను ప్రాణము హతసాక్షిగా
ఈ ధరలో నేను కనుమూతును
మహిమరాజ్యములో నిను దర్శింతును
కృపా కనికరముగలిగినా దేవుడా
నీ మహిమలో నను చేర్చు మహనీయుడ
యేసయ్య నా దేవా నీకె నా ఆరాధనా
యేసయ్య నా దేవా నీకె ఈ సంకీర్తన
నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతిచోటా
నన్ను దీవించువరకు విడువనన్నావే "2"
తల్లి మరచినా నా తండ్రి విడచిన "2"
కునుకక నిదురపోక నన్ను చూస్తున్నావు దేవ "2"